బజరంగ్ దళ్ చేసిన పనికి..ప్రేమ జంట ఆత్మహత్యయత్నం

ఆత్మహత్యకు యత్నించిన సిద్ధిపేట జంట

కాపాడిని లేక్‌‌ పోలీసులు

సైఫాబాద్‌‌, వెలుగు:వాలెంటైన్స్‌‌ డే సందర్భంగా సిద్దిపేట కోమటి చెరువు దగ్గర ఓ జంటను గుర్తు తెలియని వ్యక్తులు వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. వారు పారిపోయి వచ్చి, శుక్రవారం  హుస్సేన్‌ ‌సాగర్‌‌లో దూకి ఆత్మహత్యకు  ప్రయత్నించారు. గమనించిన పోలీసులు వారిని కాపాడారని లేక్ పోలీస్ స్టేషన్ సీఐ ధనలక్ష్మి తెలిపారు. ఇద్దరు భిన్న మతాలకు చెందినవారని, కొందరు వీడియోలు తీసి సోషల్‌‌ మీడియాలో  పెట్టడంతో ఇంట్లో తెలిస్తే గొడవలవుతాయని.. చనిపోవాలని నిర్ణయించుకున్నారన్నారు. వీరిని సిద్దిపేట్ పోలీస్ కమిషనర్ ఆఫీస్‌‌లో అప్పగిస్తామని తెలిపారు.

Latest Updates