ఇలాంటి గిఫ్ట్ ఇచ్చి మనసు దోచేయొచ్చు

లవ్‌‌లో ఉన్నవాళ్లకే కాదు.. మనసులో ప్రేమను  బయటపెట్టాలనుకునే వాళ్లకు కూడా వాలెంటైన్స్​​ డే ఎంతో స్పెషల్. ఈ స్పెషల్‌‌డే రోజు ప్రేమను వ్యక్తపరచడానికి ఎన్నో మార్గాలున్నాయి. అయితే వాటన్నింటిలో బహుమతుల స్థానం ప్రత్యేకం.  ప్రేమకు, కానుకలకు విడదీయలేని బంధం ఉంది. అమెరికన్‌‌ రైటర్ ఒ.హెన్రీ రాసిన ఒక పాపులర్ ప్రేమ కథలో ప్రేమికుడు తన వాచీ అమ్మి ప్రేయసి కోసం దువ్వెన కొంటాడు.
ఆ విషయం తెలీక ప్రియురాలు తన జుట్టు అమ్మి ప్రియుడికి వాచీ, బంగారు చెయిన్‌‌ చేయిస్తుంది. చివరికి ఆ కానుకలు రెండూ వృథా అవుతాయి. కానీ ‘కానుక’ అనే ఆ అనుభూతి వాళ్ల మధ్య ప్రేమను మరింత పెంచుతుంది.

వాలెంటైన్స్​​ డే రోజు  ప్రేమిస్తున్న వారికి ఏదైనా కానుక ఇవ్వాలనుకుంటే దానికి ముందుగానే ప్రిపేర్ అవ్వాలి. మార్కెట్‌‌లో దొరికే మోడ్రన్ గిఫ్ట్స్ లాంటివి కాకుండా.. ప్రేమలోని ప్రత్యేకతను చాటే విధంగా ఉంటే బాగుంటుంది. ఎంత చిన్నదైనా అది తమపై ఉండే ప్రేమను ఎక్స్‌‌ప్రెస్ చేసేలా ఉండాలి.  సృజనాత్మకతకు మనలో ఉన్న  ప్రేమను కలిపి బహుమతిలా ఇవ్వాలి. ప్రేమికుల కోసం కొన్ని మనసు దోచే గిఫ్ట్ ఐడియాలు ఏంటంటే..

గుర్తు చేసుకుంటూ…

ప్రేమజంట తమ బంధాన్ని మరింత అందంగా మలుచుకోవాలంటే తీపి జ్ఞాపకాల్ని గుర్తుచేసుకోవాలి. అందుకే పార్ట్‌‌నర్‌‌‌‌కు గిఫ్ట్‌‌గా  మొదటిసారి కలుసుకున్న రోజు, అప్పుడు మాట్లాడుకున్న మాటల్ని గుర్తుచేస్తూ ఒక లెటర్ రాయొచ్చు. తొలి పరిచయం, ఇద్దరూ తిరిగిన ప్రదేశాలు, మరిచిపోలేని సంఘటనలు గురించి ఒక లేఖలో రాసి ప్రత్యేకంగా ప్యాక్ చేయించి గిఫ్ట్‌‌లాగా ఇవ్చొచ్చు. అలా ప్రతి చిన్న విషయాన్ని గుర్తుంచుకుని చెప్పడం ద్వారా మీ పార్ట్‌‌నర్‌‌‌‌పై  మీకున్న  శ్రద్ధ అర్థమవుతుంది.

మెమరీస్ షేర్ చేస్తూ…

ప్రేమలో ఎన్నో మధుర జ్ఞాపకాలు ఉంటాయి. అలాంటి అందమైన జ్ఞాపకాలు అన్నీ ఫొటోల రూపంలో దాచుకోవడం అలవాటు చాలామందికి. అలాంటి వాళ్లంతా బెస్ట్ మెమరబుల్ మూమెంట్స్ లాంటి ఫొటోల్ని సెలెక్ట్ చేసుకుని ఫ్రేము కట్టించి ఇవ్వొచ్చు. ఈ తరహా గిఫ్ట్‌‌ల్లో  చాలా ఆప్షన్స్ ఉన్నాయి. గోడకు తగిలించే ఫ్రేమ్, టేబుల్ ఫ్రేమ్, కాఫీ కప్పు.. ఇలా ఎన్నో. వాటిలో ఏదో ఒకటి ఎంచుకుని పార్ట్‌‌నర్‌‌‌‌కి ఇవ్వొచ్చు.

బంగారు కానుక

కానుకల్లో బంగారు ఆభరణాలు ఎప్పుడూ ప్రత్యేకమే. అందుకే ఈరోజు గిఫ్ట్‌‌గా రింగ్ లేదంటే చిన్న గొలుసు లాంటివి ఇవ్వొచ్చు. కేవలం బంగారు నగలే కాదు. వన్ గ్రామ్ గోల్డ్‌‌లో కూడా ఎన్నో రకాల వెరైటీ ఆభరణాలు దొరుకుతున్నాయి. కొన్ని జువెలరీ షాపులు కస్టమైజ్డ్ జువెలరీని కూడా అందిస్తున్నాయి. ట్రెండ్‌‌కి తగ్గట్టు కొత్తగా ఉండే జువెలరీని డిజైన్ చేయించి గిఫ్ట్‌‌గా ఇవ్వొచ్చు.  అమ్మాయిలు అబ్బాయిలకు బ్రేస్‌‌లెట్, రింగ్ లాంటివి బహుమతిగా ఇవ్వొచ్చు.

ఇచ్చేది ఏదైనా…
వీటితో పాటు గాడ్జెట్స్, డ్రెస్ల వంటి వాటితో కూడా ప్రేమను ఎక్స్ప్రెస్ చేయొచ్చు. కాకపోతే అది సమ్థింగ్ స్పెషల్గా ఉండేలా ప్లాన్ చేసుకోవాలి. ఇచ్చేది ఎలాంటి గిఫ్ట్ అయినా.. అది మీ మధ్య ప్రేమను గుర్తుచేసేదిలా ఉండాలి. నచ్చిన రంగు డ్రెస్, ఇష్టమైన గాడ్జెట్, అందమైన హ్యాండ్ బ్యాగ్.. ఇలా పార్ట్నర్ని సంతోషపెట్టే ఏ గిఫ్ట్స్ అయినా ఇవ్వొచ్చు. ఫిజికల్ గిఫ్ట్స్ ఇవ్వడం ఇష్టం లేకపోతే నచ్చిన వంట చేసిపెట్టి
సర్ప్రైజ్ చేయొచ్చు.

వాడిపోని చెట్టుతో..
ప్రేమికులన్నాక ఫ్లవర్స్ ఇచ్చిపుచ్చుకోవడం మామూలే. అయితే ఈ వాలెంటైన్స్ డే స్పెషల్గా ఉండాలంటే.. ఆ రొటీన్లో చిన్న ఛేంజ్ చేయాలి. పువ్వు ప్రేమ వికసించడానికి సింబల్ అయితే చెట్టు ప్రేమ కలకాలం నిలబడడానికి సింబల్. అందుకే వాలెంటైన్స్ డే రోజు అందమైన బోన్సాయ్ ఫ్లవర్ ట్రీని కానుకగా ఇస్తే చెట్టు ఉన్నంత కాలం ప్రేమ వికసిస్తూనే ఉంటుంది. పైగా బోన్సాయ్ చెట్లు ఎంతో అందంగా, ముద్దుగా ఉంటాయి. వాటితో పాటు చిన్నచిన్న వెదురు మొక్కలు కూడా గిఫ్ట్స్లా ప్యాక్ చేసి ఇవ్వొచ్చు. వెదురు చెట్లు ఎక్కువకాలం ఉంటాయి. వీటిని అదృష్టానికి సింబల్గా కూడా చెప్తారు.

 

పర్సనలైజ్డ్గా..
ఇవే కాకుండా బహుమతుల కోసం కొన్ని పర్సనలైజ్డ్ ఐడియాలు కూడా ఉన్నాయి. ఫొటోలతో పర్సనలైజ్డ్ పజిల్స్, మెసేజ్ రాసి ఉండే బ్రేస్లెట్లు మార్కెట్లో దొరుకుతున్నాయి. బ్యూటిఫుల్ మూమెంట్స్గా ఉన్న ఫొటోలతో పజిల్ తయారు చేసి గిఫ్ట్గా ఇవ్వడం ద్వారా మధురమైన జ్ఞాపకాలతో పాటు ఆడుకునేందుకు సరదాగానూ ఉంటుంది. అలాగే బ్రేస్లెట్ మీద అక్షరాలు లేదా మెసేజ్ రాయించి ఇవ్వడం ద్వారా అది చూసినప్పుడల్లా ఎంతో ప్రత్యేకంగా అనిపిస్తుంది. పర్సనలైజ్డ్ గిఫ్ట్స్ ద్వారా ప్రేమలో గాఢత మరింత పెరుగుతుంది.

 

ఎకో ఫ్రెండ్లీగా…
ఈ వాలెంటైన్స్ డే రోజు మీ ప్రేమను ఎక్స్ ప్రెస్ చేయడం కోసం నేచర్కి నష్టం కలిగించాల్సిన అవసరం లేదు. అందుకే ఈ వాలెంటైన్స్ డేని ఎకో ఫ్రెండ్లీగా మార్చేయొచ్చు. ముఖ్యంగా గులాబీ పువ్వుల కోసం మొక్కలకు డ్యామేజ్ చేయకుండా.. ఫ్లవర్స్కు నో చెప్పండి. అలాగే వాలెంటైన్స్ డే రోజు సిటీలో లాంగ్ డ్రైవ్ కి వెళ్తుంటారు చాలామంది. దానివల్ల ట్రాఫిక్ లో చికాకు, పొల్యూషన్ను పెంచడం తప్ప వేరే ప్రయోజనం ఉండదు. ప్రేమికుల రోజు ప్రేమను ఫీలవ్వడానికి ప్రశాంతమైన మనసు ముఖ్యం. అందుకే అవుటింగ్కు దూరంగా ఉండడం బెటర్. వాటితో పాటు సోషల్ మీడియాల్లో పోస్టులు పెట్టడం లాంటివి కూడా మానేయాలి. ప్రేమకు ఎలాంటి ప్రమోషన్స్ అవసరం లేదు. చెప్పాలనుకున్న వ్యక్తికి ప్రేమను వ్యక్తం చేస్తే చాలు. కానుక అంటే ఎదుటి వారిపై మనకు ఎంత ప్రేమ ఉందో..
వాళ్లు మనకు ఎంత ప్రత్యేకమో సింబాలిక్గా చెప్పడం. అందుకే ఇచ్చే బహుమతి.. ప్రేమలోని స్వచ్ఛతను తెలిపేలా ఉండాలి. ప్రేమ విలువను తెలిపే బహుమతులు ఇస్తే ‘ప్రేమికుల రోజు’ ప్రత్యేకంగా మిగిలిపోతుంది.

Latest Updates