అనంతపురంలో వాల్మీకి సినిమా విడుదల నిలిపివేత

వరుణ్ తేజ్ హీరోగా నటించిన సినిమా వాల్మీకి రేపు(సెప్టెంబర్-20) విడుదల కానుంది. అయితే సినిమా విడుదలను నిలిపేయాలంటూ అనంతపురం జిల్లాలో బోయ కమ్యునిటీ సభ్యులు కలెక్టర్ ను కోరారు. దీంతో సినిమా విడుదల ను నిలిపేస్తూ కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. శాంతి భద్రత దృష్ట్యా సినిమా విడుదలను ప్రస్తుతం నిలిపివేస్తున్నట్లు తెలిపారు.

వాల్మీకి అనేది తమ కులానికి చెందని వ్యక్తి పేరని…దాన్ని ఉపయోగించుకోడంతో పాటు ఆ పాత్రను తప్పుడుగా చూపించారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు బోయ కులస్థులు. వెంటనే సినిమా టైటిల్ ను మార్చాలని లేదంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు.

అనంతపురం జిల్లా ముందబండపల్లిలో వాల్మీకి షూటింగ్ చేస్తున్న సమయంలో బోయ కులానికి చెందిన వారు అడ్డుకోవడంతో పాటు..దాడి కూడా చేశారు. అయినా పోలీసుల భారీ భద్రతల మధ్య షూటింగ్ పూర్తి చేశారు. రేపు సినిమా విడుదలకు రెడీ అయ్యింది. అయితే అనంతపురం జిల్లా కలెక్టర్ ఆదేశాలతో అక్కడ మాత్రం విడుదల కావడం లేదు.

Latest Updates