నాన్ వెజ్ అనుకున్నారా : వందే భారత్ రైలు భోజనంలో బొద్దింక..

నాన్ వెజ్ అనుకున్నారా : వందే భారత్ రైలు భోజనంలో బొద్దింక..

భోపాల్ నుంచి ఆగ్రాకు వెళ్తున్న దంపతులకు వారు ఆర్డర్ చేసిన భోజనంలో బొద్దింక వచ్చింది. ప్యాకెట్ తెరిచి చూసే సరికి సాంబర్ లో బొద్దింక ఈదుతూ కనిపించింది. దీంతో వారు ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఆ ఫుడ్ IRCTC సప్లై చేసింది. ఈ ఘటన జూన్ 18న చోటుచేసుకుంది. బాధితులు బొద్దింక ఉన్న ఫుడ్ పార్సల్ ఫొటోను Xలో షేర్ చేశారు. దీనిపై IRCTC అఫీషియల్ అకౌంట్ రెండు గంటల తర్వాత  స్పందించింది. 

సార్, మీకు కలిగిన దానికి క్షమాపణలు కోరుతున్నాము. ఈ విషయం సీరియస్ గా తీసుకొని సంబంధిత సర్వీస్ ప్రొవైడర్‌కు ఫైన్ వేశాము. తయారీ,  లాజిస్టిక్స్ పర్యవేక్షణను కూడా తీవ్రతరం చేస్తామని IRCTC తెలిపింది. దయచేసి బోజనం సప్లై చేసిన వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకోండి. ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా చూసుకుంటామని ఎక్స్ లో బదులిచ్చింది. గత వారం రోజులుగా ఇలాంటి ఫుడ్ అడల్ట్రేషన్ జరుగుతున్న ఘటనలు తరచూ వార్తల్లో ఉంటున్నాయి.