మొదటిరోజే మొరాయించిన వందే భారత్ ఎక్స్ ప్రెస్

కేంద్ర ప్రభుత్వానికి ఒక్క రోజులోనే షాకిచ్చింది వందే భారత్ ఎక్స్ ప్రెస్. ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ఫాస్టెస్ట్ ట్రెయిన్.. ఒక్క రోజులోనే బ్రేక్ డౌన్ అయ్యింది. నిన్న ఉదయం ప్రధానమంత్రి నరేంద్రమోడీ.. ఢిల్లీలో ఈ రైలును జెండా ఊపి ప్రారంభించారు.

మొదటి జర్నీలో భాగంగా ఢిల్లీ నుంచి వారణాసి వెళ్లిన ఈ రైలు.. ఇవాళ ఉదయం తిరుగు ప్రయాణంలో మొరాయించింది. వారణాసి నుంచి 150 కిలోమీటర్లు ప్రయాణించాక.. సాంకేతిక సమస్య రావడంతో మధ్యలోనే ఆగిపోయింది. ఇంజినీర్లు కూడా దానిని సరిచేయలేకపోయారు. దీంతో మరో రెండు రైళ్లను రప్పించి అందులోని ప్రయాణికులను తరలించారు.

Latest Updates