వరవరరావును వెంటనే విడుదల చేయాలి-చుక్క రామయ్య

మహబూబాబాద్ జిల్లా : జైలులో అనారోగ్యంతో బాధపడుతున్న ఉద్యమకారుడు వరవరరావు ను మానవతా దృక్పథంతో వెంటనే విడుదల చేయాలని చుక్కా రామయ్య డిమాండ్ చేశారు. తొర్రూరులో ఆయన మాట్లాడుతూ..  ప్రజాస్వామ్య వ్యవస్థ లో జీవించే హక్కు ప్రాధమికమైనదని గుర్తు చేశారు. వరవరరావు కు మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ కు తరలించాలని విజ్ఞప్తి చేసిన ఆయన చివరి దశలో ఆయనను మనోవేదనకు గురిచేయడం భావ్యం కాదన్నారు. వరవరరావును జైలులోనే చనిపోయే పరిస్థితి తీసుకురావద్దని ఆయన సూచించారు.

Latest Updates