ఇది వెరైటీ…! చంద్రబాబు బర్త్ డే కేక్ చూశారా..?

కేక్ లు పలు రకాలు. బ్లాక్ ఫారెస్ట్, చాకొలెట్, పైనాపిల్, వెనీలా, బటర్ స్కాచ్…. ఇలాంటివి ఫ్లేవర్లలో వెరైటీలు. మరి డిజైన్ల సంగతైతే చెప్పాల్సిన పనిలేదు. ఎన్ని డిజైన్లున్నా… ఏపీ సీఎం చంద్రబాబు ఇవాళ పుట్టినరోజు సందర్బంగా కట్ చేసిన కేక్ డిజైన్ మాత్రం డిఫరెంట్ అని చెప్పాలి.

చంద్రబాబు ఇవాళ బర్త్ డే కేక్ ను కుటుంబసభ్యుల నడుమ హైదరాబాద్ లో కట్ చేశారు. భార్య భువనేశ్వరి, కోడలు బ్రాహ్మణి, కొడుకు లోకేశ్, మనవడు దేవాన్ష్ నడుమ సెలబ్రేట్ చేసుకున్నారు. కేక్ ను ఆయన ఇంటి సభ్యులు డిఫరెంట్ గా డిజైన్ చేయించారు. చంద్రబాబు ఎప్పుడూ ధరించే లేత పసుపుపచ్చ రంగులో కేక్ ఉంది. షర్ట్ కాలర్, బటన్లు, కళ్లద్దాలు, జేబులో పెన్ను, ఇలా… కేక్ ను పెద్దగా రంగుల్లేకుండా.. వెరైటీగా .. క్రియేటివ్ గా తయారుచేయించారు. దానిపై “హ్యాపీ బర్త్ డే టు అవర్ హీరో” అని మెసేజ్ రాసి ఉంచారు.

Latest Updates