గడ్డం,చెవిపోగుతో వరుణ్ ‘వాల్మీకి‘ లుక్

డిఫరెంట్ మూవీస్ సెలక్ట్ చేసుకుంటూ తనకంటూ ఓ స్టైల్ ను క్రియేట్ చేసుకున్న హీరో వరుణ్ తేజ్ లేటెస్ట్ గా హరీశ్ శంకర్ డైరెక్షన్ లో వాల్మీకి చేస్తున్నాడు. ఈ మూవీ గురువారం  ఫస్ట్ షూట్ జరుపుకుంది. వరుణ్ పై కొన్ని సీన్స్ తీసిన హరీశ్ శంకర్ ఓ లుక్ ను రిలీజ్ చేశారు. ఈ లుక్ లో వరుణ్ తేజ్ లుక్ కొత్తగా ఉంది. గడ్డం, చెవికి పోగు, పెద్ద హెయిర్ తో ఉన్న ఈ స్టిల్  ఇంట్రెస్ట్ గా ఉంది. ‘వాల్మీకి స్వాగతం.. తొలి రోజు షూటింగ్ అద్భుతంగా జరిగింది. మండు వేసవిలో పని చేస్తున్న సినిమాటో గ్రాఫర్ వయాంక్ బోస్ గారికి కంగ్రాట్స్ ‘ అంటూ హరీశ్ శంకర్ ట్వీట్ చేశారు. ఈ మూవీకి దేవీశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నారు.

Latest Updates