ఫామ్ హౌజ్‌లో ఉండే డాన్ వద్దు.. వాల్మీకి ట్రైలర్ రిలీజ్

‘గబ్బర్ సింగ్’ ఫేమ్ హరీష్ శంకర్ – వరుణ్ తేజ్ కాంబినేషన్ లో వస్తోన్న వాల్మీకి సినిమా ట్రైలర్ విడుదలైంది. వరుణ్ తేజ్ ఫస్ట్ టైమ్ ఓ ఊరమాస్ డాన్ గా, గ్యాంగ్ స్టర్ గా నటిస్తున్న మూవీ ఇది. టీజర్ లాగే.. ట్రైలర్ ఆకట్టుకునేలా ఉంది.

ఓ మాస్ కుర్రాడి.. 1980స్ నాటి లవ్ స్టోరీ .. తర్వాత అతడి రౌడీ లైఫ్ ను వినోద ప్రధానంగా తీసినట్టుగా మూవీ మేకర్స్ చెప్పారు. తమిళ్ సినిమా జిగర్తాండ ఆధారంగా చేసుకుని ఈ మూవీ.. తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా, హీరోకి మాస్ అప్పీల్ పెంచి.. మ్యాగ్జిమమ్ మార్పులు చేసినట్టుగా తెలుస్తోంది.

వాల్మీకిలో వరుణ్ తేజ్ క్యారెక్టర్ పేరు గద్దలకొండ గణేశ్. “నా పైన పందేలేస్తే గెలుస్తరు…నాతోటి పందేలేస్తే సస్తరు”, “మనం బతుకుతున్నామని పది మందికి తెల్వగకపోతే బతుకుడెందుకురా”, “గవాస్కర్ సిక్స్ కొట్టుడు.. బప్పిలహరి పాట కొట్టుడు.. నేను బొక్కలిరగ్గొట్టుడు సేమ్ టు సేమ్”, “గత్తర లేపినవ్.. చింపేసినవ్” లాంటి డైలాగ్స్ ఆకట్టుకుంటున్నాయి.

భరత్ అనే నేను మూవీలో మహేశ్ క్యారెక్టర్ ను పేరడీ చేస్తూ.. గబ్బర్ సింగ్ అంత్యాక్షరి సీన్ రిపీట్ చేసినట్టుగా ఓ సీన్ ఆకట్టుకుంటుంది.

మూవీలో పూజా హెగ్డే కథానాయిక. అధర్వది మరో కీలక పాత్ర. ముకుంద తర్వాత వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న సినిమా ఇదే. మిక్కీ జే మేయర్ సంగీతం అందించాడు.

Latest Updates