రూ.20 లక్షల ఆఫర్ మిస్..వరుణ్ ఎలిమినేట్

బిగ్ బాస్-3 గ్రాండ్ ఫినాలె ఉత్కంఠగా సాగుతోంది. టాప్ 5 నుంచి అలీరాజా ఎలిమేనెట్ అవ్వగానే నాగార్జున టాప్4 లో ఉండే వారికి బంపర్ ఆఫర్ ఇచ్చారు. ఎవరైన ఒక కంటెస్ట్ రూ.10 లక్షలు తీసుకుని హౌస్ నుంచి వెళ్లిపోవచ్చన్నారు. దీనికి ఎవరూ ఒప్పుకోలేదు. దీనికి మరో రూ.10 లక్షలు కలిపి రూ.20 లక్షల ఆఫర్ ఇచ్చారు నాగార్జున.అయితే దీనికి కూడా టాప్ 4 కంటెస్ట్ లో ఉన్న బాబా భాస్కర్ ,శ్రీముఖి,వరుణ్, రాహుల్ ఎవరూ తీసుకోలేదు. దీంతో రూ.20లక్షల ఆఫర్ మిస్సయ్యారు. అయితే ఫైనల్ గా టాప్ 4 నుంచి వరుణ్ సందేశ్ ఎలిమేనేట్ అయ్యారు. దీంతో శ్రీముఖి,రాహుల్, బాబాభాస్కర్ టాప్ 3కంటెస్ట్ గా బిగ్ బాస్ హౌస్ లో ఉన్నారు.

Latest Updates