వాల్మీకి ప్రీ టీజర్‌ అదుర్స్ : మాస్ లుక్ లో మెగా హీరో

హరీష్ శంకర్ డైరెక్షన్ లో మెగా హీరో వరుణ్ తేజ్ నటిస్తున్న సినిమా వాల్మీకి. వరుణ్ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీకి సంబంధించిన ప్రీ టీజర్‌ సోమవారం రిలీజైంది. డైలాగులేమీ లేకుండా వచ్చిన ఈ టీజర్‌ లో వరుణ్‌ తేజ్‌ గడ్డం, చేతిలో తుపాకీ, కంటికి సుర్మా పెట్టుకుని, మాస్‌ లుక్‌లో కనిపించాడు. ప్రస్తుతం  షూటింగ్ జరుపుకొంటున్న ‘వాల్మీకి’ సినిమాకు మిక్కీ జే మేయర్‌ మ్యూజిక్. 14రీల్స్‌ ప్లస్‌ బ్యానర్ పై రామ్‌ ఆచంట, గోపి ఆచంటలు నిర్మిస్తున్న ఈ సినిమాను దసరాకు రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తుంది యూనిట్. వరుణ్ తేజ్ , పూజా హెగ్డే జంటగా నటించిన ముకుంద సినిమా హిట్ కావడంతో..వాల్మీకిపై కూడా భారీ అంచనాలు పెట్టుకున్నారు మెగా ఫ్యాన్స్.

Latest Updates