ప్రియుడి మోజులో భర్తను చంపింది

ఈ నెల 13న వసంత్ అనే వ్యక్తి అనుమానాస్పదంగా చనిపోయాడు. ఈ ఘటన కీసర పోలీస్ స్టేషన్ పరిధిలోని బండ్లగూడ ఆర్జీకే కాలనీలో జరిగింది. హత్యపై విచారణ చేపట్టిన పోలీసులు పలువురిని విచారించగా హతుని భార్య రేణుక మర్డర్ చేసినట్టుగా తెలిసింది. రేణుకకు ఉన్న వివాహేతర సంబంధమే వసంత్ హత్యకు కారణమని తెలిపారు పోలీసులు.

వసంత్, రేణుక.. బండ్లగూడ ఆర్జీకే కాలనీలో నివసిస్తున్నారు. రేణుకకు స్థానికి గ్యాస్ ఏజన్సీలో పనిచేస్తున్న కిషోర్(23) అనే యువకునితో పరిచయం అయింది. వాళ్ల పరిచయం వివాహేతర సంబంధానికి దారితీసింది. దీంతో భర్త ను అడ్డుతొలగించుకోవాలనుకుంది రేణుక. తన ప్రియుడు కిషోర్ సహాయంతో ఈనెల 13న తాగి ఇంట్లో పడిఉన్న భర్త వసంత్ ను రాడ్ తో కొట్టి, మెడకు చెన్నీ బిగించి చంపారు.

స్థానిక వార్డు మెంబర్ వెంకటేష్, స్థానికుల ఫిర్యాదుతో రేణుక, కిషోర్ లను విచారించగా వసంత్ ను తామే హత్య చేశామని ఒప్పుకున్నారు. దీంతో రేణుక, ఆమె ప్రియుడు కిషోర్ లను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు కీసర పోలీసులు.

Latest Updates