బాసరలో ఘనంగా వసంత పంచమి వేడుకలు

ప్రముఖ పుణ్యక్షేత్రం బాసర…. వసంత పంచమి వేడుకలకు సిద్ధమైంది. అమ్మవారి జన్మనక్షత్రం కావడంతో భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. వేడుకలకు లక్ష మందికి పైగా భక్తులు వస్తారని అంచనా. భక్తుల రద్దీకి తగ్గట్లు ఏర్పాట్లు చేశారు అధికారులు.

మూడు రోజుల పాటు జరిగే ఉత్సవాల కోసం ఆలయాన్ని సర్వాంగ సుందరంగ ముస్తాబు చేశారు. విద్యుత్ కాంతుల్లో ఆలయం మెరిసిపోతోంది. అమ్మవారికి నేడు ప్రత్యేక పూజలు చేయనున్నారు. మంగళ వాయిద్యాసేవ, సుప్రభాత సేవ, అభిషేకం, పూర్ణాహుతి, మహావిద్యా హోమం, బలిదానం, గణపతి హోమం, చండీయాగం, కుంకుమార్చనతో పాటు అక్షరాభ్యాసాలు జరుగుతాయి. అమ్మవారి జన్మనక్షత్రం కావడంతో పంచమి రోజు అక్షరాభ్యాసాలు చేయిస్తే… పిల్లలకు మంచి భవిష్యత్ ఉంటుందనేది భక్తుల నమ్మకం.

వేడుకలకు తెలంగాణతో పాటు మహారాష్త్ర, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచీ భక్తులు తరలివస్తారు. దాదాపు లక్ష మందికి పైగా భక్తులు వస్తారని అంచనా వేస్తున్నారు. భక్తులకు ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేశారు అధికారులు. క్యూలైన్లోని భక్తులకు పాలు, మంచినీళ్లు, బిస్కెట్లు, పండ్లు పంపిణీ చేయనున్నారు. పుణ్యస్నానాలు చేసే గోదావరి నది దగ్గర గజ ఈతగాళ్లను అందుబాటులో ఉంచారు. అవాంఛనీయ ఘటనలు జరక్కుండా గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.

Latest Updates