బంగారు తేరుపై ఊరేగిన శ్రీవారు

తిరుమలలో వసంతోత్సవాలు కన్నువ పండువగా జరుగుతున్నాయి. సందర్భంగా శ్రీవారిని బంగారు తేరుపై ఊరేగించారు. సర్వాలంకార భూషితుడైన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి వారి స్వర్ణ రథంపై తిరువీధులలో విహరిస్తూ భక్తులను కటాక్షించారు. ఏడాదిలో బ్రహ్మోత్సవాలు, వైకుంఠ ఏకాదశి ,వసంతోత్సవాల్లో మలయప్పస్వామి స్వర్ణరథంపై భక్తులకు దర్శనమిస్తారు. శైభ్య, సుగ్రీవ, మేఘపుష్ప, వాలాహక అనే నాలుగు గుర్రాలతో ఏర్పాటు చేసిన స్వర్ణరథంపై స్వామి వారు విహరిస్తున్నారు.

 

Latest Updates