మా ఊరికి ఎవరూ రావొద్దంటూ.. సెల్ఫ్ లాక్ డౌన్

ఏకగ్రీవంగా తీర్మానం చేసిన  వావిలాల గ్రామ పంచాయతీ

కరీంనగర్:  కరోనా మహమ్మారి శరవేగంగా విస్తరిస్తుండడం గ్రామీణ ప్రాంతాల్లో భయాందోళనలు సృష్టిస్తోంది. ఒకవైపు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ కు నిరాకరిస్తుండడం ఏం చేయాలో పాలుపోని పరిస్థితులు ఏర్పడుతున్నాయి. కఠినంగా లాక్ డౌన్ ప్రకటించడం తప్ప మరో మార్గం లేదంటూ.. కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం వావిలాల గ్రామం సెల్ఫ్ లాక్ డౌన్ ప్రకటించింది.  కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఇవాళ్టి నుంచి ఈ నెల 31 వరకు లాక్ డౌన్ చేయాలని గ్రామ పంచాయతీ ఏకగ్రీవంగా తీర్మానించింది. ఈ మేరకు అధికారులకు సమాచారం పంపించారు. ఇది అందరి సమిష్టి నిర్ణయమని  గ్రామస్తులు ప్రకటించారు.. ఊరి బయట బ్యారికేడ్లు కట్టి..  కంచె వేసి తమ గ్రామంలోకి ఎవరూ రాకుండా.. ఊరి వాళ్లు కూడా ఎవరూ బయటి గ్రామాలకు వెళ్లకుండా జాగ్రత్తలు పడుతున్నారు.

Latest Updates