రేపు తీరం దాటనున్న వాయు : ముంబైలో భారీవర్షాలు

అరేబియా సముద్రతీరంలో ఆరెంజ్ అలర్ట్ కొనసాగుతోంది. రేపు వాయు తుఫాన్ గుజరాత్ తీరాన్ని దాటే అవకాశం ఉండగా ఇవాళ ముంబైలో వర్షాలు, ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. ఉత్తర మహారాష్ట్ర ప్రాంతంలో యాభై నుంచి 60 కిలోమీటర్ల వేగంలో గాలులు వీస్తున్నాయి. వాయుమార్గాల్లో ప్రయాణంతో ప్రమాదం పొంచి ఉందని హెచ్చరిస్తున్నారు అధికారులు. తీరాల్లో జాలర్లు అలర్ట్ గా ఉండాలన్నారు.

రేపు గుజరాత్ తీరాన్ని సైక్లోన్ తాకనుండటంతో.. అప్రమత్తం అయ్యారు అధికారులు. వల్సాద్ జిల్లాలోని 20 గ్రామాల్లో కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఉందని హెచ్చరికలు ఇచ్చారు. తీర ప్రాంతంలోని 39 స్కూళ్లను.. కచ్ లోని కండ్లా పోర్టును తాత్కాలికంగా మూసేశారు. ద్వారక, సోమ్ నాథ్, కచ్ లోని టూరిస్టులను సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచిస్తున్నారు అధికారులు. తుఫాన్ ఎఫెక్ట్ ఉండే ప్రాంతాల్లో అన్ని రకాల ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు. NDRF బృందాలు తీరప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.

Latest Updates