అప్పుల బాధతో చంద్రశేఖర్‌ ఆత్మహత్య

  • గుండెపోటు కాదని పోలీసుల వెల్లడి
  • బీసీసీఐ, క్రికెటర్ల సంతాపం

చెన్నై: ఇండియా మాజీ ఓపెనర్‌, నేషనల్‌టీమ్‌ మాజీ సెలెక్టర్‌ వీబీ చంద్రశేఖర్‌ గుండె -పోటుతో మరణిం చలేదని, అప్పుల బాధతోఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులుతెలిపారు. అప్పుల కారణంగా కొన్నాళ్లుగాతీవ్ర ఒత్తిడిలో ఉన్న వీబీ గురువారం రాత్రితన నివాసంలో ఉరేసుకున్నారని ప్రకటించారు. గుండె పోటుతో మరణించినట్టు వచ్చిన వార్తలు నిజం కాదన్నారు. ఆయన ఆరోగ్యం కూడా క్షీణించిందని, చాలా బలహీనంగా మారిపోయారని చెప్పారు. మరో ఐదు రోజుల్లో 58 ఏళ్లకు చేరుకోనున్న వీబీకిభార్య, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. ఇండియాతరఫున 1988 నుం చి 1990 వరకు ఏడువన్డేలు ఆడిన చంద్రశేఖర్‌ 81 ఫస్ట్​క్లాస్‌ మ్యాచ్‌ల్లో 4999 రన్స్‌ చేశారు. వృత్తిరీత్యాఇంజనీర్‌ అయిన వీబీ 1987-–88లో రంజీట్రోఫీ నెగ్గిన తమిళనాడు జట్టు లో సభ్యుడు.తమిళనాడు ప్రీమియర్‌ లీగ్‌లో ఒక జట్టు కు(వీబీ కంచి వీరన్స్‌) యజమాని అయినచంద్రశేఖర్‌.. బీసీసీఐ మాజీ అధ్యక్షుడు ఎన్‌శ్రీనివాసన్​కు సన్నిహితు డు. ఐపీఎల్‌లోచెన్నై సూపర్‌ కింగ్స్‌ తరఫున ఆడేందుకు మహేంద్రసింగ్‌ ధోనీని ఒప్పించడంలో కీలక పాత్ర పోషిం చారు. అలాంటి వ్యక్తి మరణం పట్ల తమిళనాడు క్రికెట్‌ సంఘం,బీసీసీఐతో పాటు క్రికెటర్లు సచిన్‌ టెండూల్కర్‌, అనిల్‌ కుంబ్లే, క్రిష్ణమచారి శ్రీకాంత్‌, హర్భజన్‌ సింగ్‌, సురేశ్‌ రైనా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు సంతాపం తెలియజేశారు.

Latest Updates