చంద్రయాన్‌‌ 3 ప్రాజెక్టు డైరెక్టర్‌‌గా వీరముత్తువేల్‌‌

చంద్రయాన్‌‌ 2 .. ఇండియా ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రాజెక్టు. ప్రయోగం 95 శాతం సక్సెసయినా రోవర్‌‌ మాత్రం చంద్రునిపై సరిగా దిగలేకపోయింది. సాఫ్ట్‌‌ ల్యాండింగ్‌‌ కాస్త హార్డ్‌‌ ల్యాండింగ్‌‌ అయింది. చంద్రయాన్‌‌ 2 పరిణామాల నేపథ్యంలో ఆ ప్రాజెక్టు డైరెక్టర్‌‌ ఎం .వనితను త్వరలో చేపట్టనున్న చంద్రయాన్‌‌ 3కి ఇస్రో ఎంపిక చేయలేదు. ఆమె స్థానంలో ఇస్రో హెడ్‌‌క్వార్టర్‌‌లో పని చేస్తున్న సైంటిస్టు పి. వీరముత్తువేల్‌‌ను సెలెక్టు చేసింది. చంద్రయాన్‌‌ 2ను నడిపించిన మరో సైంటిస్టు రితు కరిధాల్‌‌ మాత్రం మూడో ప్రాజెక్టులోనూ కొనసాగుతున్నారు. వనితను పేలోడ్‌‌, డేటా మేనేజ్‌‌మెంట్‌‌, స్పేస్‌‌ ఆస్ట్రానమీ (పీడీఎంఎస్‌‌ఏ) డిప్యూటీ డైరెక్టర్‌‌గా నియమిస్తున్నట్టు నవంబర్‌‌ 28న ఇస్రో వెల్లడించింది. ఆమెను ట్రాన్స్‌‌ఫర్‌‌ చేయడానికి గల కారణాలను మాత్రం వెల్లడించలేదు. చంద్రయాన్‌‌ 2కు సంబంధించి అన్ని సిస్టమ్‌‌లను వనిత టీం దగ్గరుండి చూసుకుంది. మూడో ప్రాజెక్టుకు సంబంధించిన మేనేజ్‌‌మెంట్‌‌ టీంను కూడా వీరముత్తువేల్‌‌ ముందుండి నడిపిస్తారని ఇస్రో డిసెంబర్‌‌ 7న మరో ఆర్డర్‌‌ జారీ చేసింది. చంద్రయాన్‌‌ 3 కోసం ఇస్రో 29 మంది డిప్యూటీ ప్రాజెక్టు డైరెక్టర్లను ఎంపిక చేసింది. ల్యాండర్‌‌, రోవర్‌‌ పనులను కూడా వీళ్లే చూసుకోనున్నారు. నవంబర్‌‌ 14నే చంద్రయాన్‌‌ 3 ప్రాజెక్టు పనులను ఇస్రో స్టార్ట్‌‌ చేసింది.

Latest Updates