పరీక్ష ఫెయిలైన వారికి వీరేంద్ర సెహ్వాగ్ మెసేజ్

ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యలు రాష్ట్రంలో ఇటీవల కాలంలో సంచలనం రేపుతున్నాయి. ఆ సెగ ఇంకా చల్లారలేదు. విద్యార్థులు ఆత్మస్థైర్యం కోల్పోవద్దని.. చాలామంది సెలబ్రిటీలు, నాయకులు కోరారు. దేశమంతటా CBSE క్లాస్ 12 రిజల్ట్ గురువారం విడుదలయ్యాయి. ఈ ఫలితాలు విడుదలయ్యాక కూడా.. దేశమంతటా చాలామంది విద్యార్థులకు కొన్ని సూచనలు చేశారు.

మాజీ క్రికెటర్, యూత్ ఇన్ స్పిరేషనల్ ఐకన్ అయిన వీరేంద్ర సెహ్వాగ్ కూడా స్టూడెంట్స్ కు స్పెషల్ గా ఓ మెసేజ్ ఇచ్చాడు. “సీబీఎస్ఈ క్లాస్ 12లో బాగా పెర్ ఫామ్ చేసి సంతోషంగా ఉన్న అమ్మాయిలు, అబ్బాయిలకు నా శుభాకాంక్షలు, అభినందనలు. ఇదే సమయంలో ఫలితాలతో సంతోషంగా లేని వాళ్లు.. దయచేసి చిల్ అవ్వండి. మార్కుల కంటే జీవితం చాలా పెద్దదన్న సంగతి గుర్తుంచుకోండి” అని తనదైన స్టైల్ లో ఫ్రెండ్లీగా ఓ మెసేజ్ ఇచ్చాడు సెహ్వాగ్.

సమయానికి తగ్గట్టుగా స్పందించారు.. వెల్ సెడ్ వీరూ భాయ్ అంటూ… నెటిజన్స్ సెహ్వాగ్ ను అభినందించారు.

Latest Updates