వెలుగు క్రికెట్ టోర్ని: 10 ఫిబ్రవరి అప్డేట్స్

మహబూబ్ నగర్ జిల్లాలో వెలుగు క్రికెట్ టోర్నమెంట్ ఉత్సాహంగా సాగుతోంది. గ్రూప్ దశలో మహబూబ్ నగర్, జడ్చర్ల జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో మహబూబ్ నగర్ టీమ్ విజయం సాధించింది. దాంతో గ్రూప్ ఏ నుంచి మహబూబ్ నగర్ జట్టు సెమీఫైనల్ లో బెర్తు ఖాయం చేసుకుంది. ముందుగా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకొన్న మహబూబ్ నగర్ టీమ్ 20ఓవర్లలో 8వికెట్లు నష్టపోయి 161 పరుగులు చేసింది. చేజింగ్ కు దిగిన జడ్చర్ల టీమ్ 104 పరుగులకు ఆలౌట్ అయ్యింది. దాంతో 57పరుగుల తేడాతో విజయం సాధించింది మహబూబ్ నగర్ టీమ్. ఆల్ రౌండ్ ప్రదర్శనతో మహబూబ్ నగర్ టీమ్ విజయంలో కీలకపాత్ర పోషించిన ధ్యాన్ చంద్ కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.

Latest Updates