వెలుగు క్రికెట్ టోర్ని: 11 ఫిబ్రవరి అప్డేట్స్

గ్రామీణ క్రీడాకారుల ప్రతిభను గుర్తించేందుకు వెలుగు దినపత్రిక ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న క్రికెట్ మ్యాచ్ లు మెదక్ జిల్లా కేంద్రంలో జరుగుతున్నాయి. రెండో రోజు వెలుగు టోర్నీకి ముఖ్య అతిథిగా హాజరయ్యారు మెదక్ మున్సిపల్ వైస్ ఛైర్మన్ రాగి అశోక్. రెండో రోజు మెదక్- నర్సాపూర్, ఆందోల్ -నర్సాపూర్ టీంల మధ్య మ్యాచ్ లు జరిగాయి.

గ్రామీణ క్రీడాకారుల ప్రతిభను గుర్తించేందుకు వెలుగు దినపత్రిక ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న క్రికెట్ మ్యాచ్ లు మెదక్ జిల్లా కేంద్రంలో జరుగుతున్నాయి. రెండో రోజు వెలుగు టోర్నీకి ముఖ్య అతిథిగా హాజరయ్యారు మెదక్ మున్సిపల్ వైస్ ఛైర్మన్ రాగి అశోక్. రెండో రోజు మెదక్- నర్సాపూర్, ఆందోల్ -నర్సాపూర్ టీంల మధ్య మ్యాచ్ లు జరిగాయి. మెదక్ నర్సాపూర్ మ్యాచ్ లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న మెదక్ జట్టు 6 వికెట్ల నష్టానికి 139 పరుగులు చేసింది. తర్వాత చేజింగ్ కు దిగిన నర్సాపూర్ 105 పరుగులకే అలౌట్ అయింది. ఆందోల్, నర్సాపూర్ మ్యాచ్ లో నర్సాపూర్ గెలుపొందింది.

మిర్యాలగూడ మున్సిపల్ కమిషనర్ సత్యబాబు, నల్గొండ జిల్లా మిర్యాలగూడలోని రాజీవ్ గాంధీ స్టేడియంలో జరుగుతున్న వెలుగు టోర్నీకి  హాజరయ్యారు. క్రీడాకారులను పరిచయం చేసుకుని వారితో కాసేపు క్రికెట్ ఆడారు. ఇశాళ దేవరకొండ, నకిరేకల్ మధ్య జరిగిన మ్యాచ్ లో నకిరేకల్ టీమ్ విజయం సాధించింది. మొదట టాస్ బ్యాటింగ్ ఎంచుకున్న దేవరకొండ…15 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 59 పరుగులు మాత్రమే చేసింది. తర్వాత చేజింగ్ కు దిగిన నకిరేకల్ టీం కేవలం 9.2 బంతుల్లోనే 4 వికెట్ల నష్టాపోయి లక్ష్యాన్ని చేధించింది…..

మహబూబ్ నగర్ జిల్లా పోటీల్లో మూడు విజయాలతో మహబూబ్ నగర్ టీం సెమీస్ కు చేరింది. జడ్చర్ల జట్టుపై 57 పరుగుల తేడాతో మహబూబ్ నగర్ టీమ్ విజయం సాధించింది. ఈ విజయంతో గ్రూప్-ఎ నుంచి మహబూబ్ నగర్ జట్టు సెమీఫైనల్ బెర్తు ఖాయం చేసుకుంది. ముందుగా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న మహబూబ్ నగర్ జట్టు 8 వికెట్ల నష్టానికి 161 పరుగులు చేసింది. తర్వాత చేజింగ్ కు దిగిన జడ్చర్ల జట్టు 104 పరుగులకే ఆలౌటైంది. ఆల్ రౌండ్ ప్రదర్శనతో మహబూబ్ నగర్ టీమ్ విజయంలో కీలకపాత్ర పోషించిన ధ్యాన్ చంద్ కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.

మహబూబ్ నగర్ లో జరిగిన మ్యాచ్ ను తిలకించారు.. ప్రెస్ అకాడమీ ఛైర్మన్ అల్లం నారాయణ. గ్రామీణ క్రీడాకారులకు ఇదో మంచి అవకాశమన్నారు. యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.

సంగారెడ్డిలో జరిగిన మ్యాచులను టోర్నీ నిర్వాహకులు వరుణ్ ప్రారంభించారు. మొదటి మ్యాచులో జహీరాబాద్ పై సంగారెడ్డి జట్టు ఘన విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన జహీరాబాద్ నిర్ణీత ఓవర్లలో 120 రన్స్ కొట్టింది. 121 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన సంగారెడ్డి… 3 వికెట్లు కోల్పోయి 124 రన్స్ చేసి విజయాన్ని సొంతం చేసుకుంది. మరో మ్యాచ్ లో నారాయణఖేడ్ పై విక్టరీ కొట్టింది పటాన్ చెరు జట్టు. మొదట బ్యాటింగ్ చేసిన పటాన్ చెరు నిర్ణీత ఓవర్లలో 150 రన్స్ కొట్టింది. 151 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన నారాయణఖేడ్ నిర్ణీత ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి.. 117 రన్స్ మాత్రమే చేసింది.

Latest Updates