వెలుగు క్రికెట్ టోర్నీ: 17ఫిబ్రవరి అప్డేట్స్

రాష్ట్రవ్యాప్తంగా వెలుగు క్రికెట్ టోర్నీ ఉత్సాహంగా సాగుతోంది. జిల్లాల్లో జరుగుతున్న టోర్నీకి ప్లేయర్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఆద్భుతమైన ఆటతీరుతో ప్లేయర్స్ ప్రతిభ కనబరుస్తున్నారు. గ్రామీణ ప్రాంత క్రీడాకారులకు వెలుగు టోర్నీ ఎంతో ఉపయోపడుతుందంటున్నారు ప్లేయర్స్.

వెలుగు దినపత్రిక నిర్వహిస్తున్న టీ20-క్రికెట్ టోర్నీ పోటీలు రాష్ట్రవ్యాప్తంగా జోరుగా జరుగుతున్నాయి. కరీంనగర్ లోని SRR కాలేజీ గ్రౌండ్స్ లో రెండోరోజు రోజు మ్యాచ్ లు ఉత్సాహంగా జరిగాయి. హుజురాబాద్, కరీంనగర్ జట్ల మధ్య జరిగిన మొదటి మ్యాచ్ లో కరీంనగర్ విజయం సాధించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న హుజురాబాద్ టీమ్.. 9 వికెట్ల నష్టానికి.. 105 రన్స్ చేసింది. 106 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కరీంనగర్ జట్టు 12.1 ఓవర్లలో 2 వికెట్లు మాత్రమే కోల్పోయి టార్గెట్ చేజ్ చేసింది.

మానకొండూరు, హుస్నాబాద్ జట్ల మధ్య జరిగిన రెండో మ్యాచ్ లో మానకొండూరు టీమ్ 91 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన మానకొండూరు 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 184 పరుగులు చేసింది. 185 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన హుస్నాబాద్..16 ఓవర్లలో 94 పరుగులకే ఆలౌట్ అయింది. బ్యాటింగ్, బౌలింగ్ లో రాణించిన ప్లేయర్ సద్గురుకు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ వచ్చింది.

ఖమ్మంలో మూడోరోజు కూడా వెలుగు క్రికెట్ టోర్నీ ఉత్సాహంగా జరిగింది. జిల్లాలో జరుగుతున్న మ్యాచ్ లకు హార్వెస్ట్ పబ్లిక్ స్కూల్ అండ్ జూనియర్ కాలేజీ స్పాన్సర్ గా వ్యవహరిస్తోంది. మొదట ఖమ్మం, వైరా జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో ఖమ్మం టీమ్ విజయం సాధించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న వైరా టీమ్..19.5 ఓవర్లలో 103 రన్స్ కు ఆలౌట్ అయింది. 104 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఖమ్మం టీమ్..14.3 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 105 రన్స్ చేసి విజయం సాధించింది. 4 ఓవర్లలో 14 పరుగులిచ్చి 4 వికెట్లు తీసిన విజయ్ మ్యాచ్ ఆఫ్ ది మ్యాచ్ గా  నిలిచాడు.

మధిర, పాలేరు జట్ల మధ్య జరిగిన రెండో మ్యాచ్ ను ఖమ్మం ఏసీపీ వెంకట్రావు ప్రారంభించారు. టాస్ గెలిచి బ్యాంటింగ్ కు దిగిన పాలేరు టీమ్..20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 166 రన్స్ చేసింది. 167 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన మధిర జట్టు 19.3 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి టార్గెట్ ఫినిష్ చేసింది. 43 బంతుల్లో 67 రన్స్ చేసిన సుధీర్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు. ఖమ్మం జిల్లా పూల్ A నుంచి ఖమ్మం టీమ్ సెమీస్ కు అర్హత సాధించింది. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ప్రతిభావంతులైన క్రికెటర్లను..వెలుగులోకి తెచ్చేందుకు టోర్నీ ఉపయోగపడుతుందన్నారు ప్లేయర్స్.

Latest Updates