వెలుగు క్రికెట్ టోర్ని: 18ఫిబ్రవరి అప్డేట్స్

రాష్ట్ర వ్యాప్తంగా వెలుగు దినపత్రిక నిర్వహిస్తున్న క్రికెట్ టోర్నీలు నువ్వా నేనా అంటూ సాగుతున్నాయి. ప్రతీ జిల్లాల్లో యువత ఉత్సాహంగా పాల్గొంటున్నారు. ఇందులో భాగంగా…  పెద్దపల్లి జిల్లాలో జరిగిన మ్యాచ్ లు ఉత్సాహంగా జరిగాయి.

లీగ్ మ్యాచ్ లో గోదావరిఖని జట్టుపై రామగుండం టీం ఘన విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన రామగుండం నిర్ణీత ఓవర్లలో 6 వికెట్లు నష్టపోయి.. 202 రన్స్ కొట్టింది. కన్నా 50 బాల్స్ లో 91 రన్స్, ధనుష్ 27 బాల్స్ లో 46 రన్స్ కొట్టారు.. తర్వాత 203 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన రామగుండం టీమ్ ను 80 రన్స్ కే ఆలౌట్ చేశారు. 122 పరుగుల తేడాతో ఘన విజయం సాధించారు. 91 పరుగులు కొట్టిన కన్నాకు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది. అంతకుముందు ఈ మ్యాచ్ ను ప్రభుత్వ సలహాదారు వివేక్ వెంకటస్వామి ప్రారంభించారు. 90 నియోజకవర్గాల నుంచి ప్లేయర్లను ఎంపిక చేసి మ్యాచ్ లు జరుపుతున్నామని చెప్పారు. వచ్చే ఏడాది మరింత ప్రోత్సాహంతో వెలుగు టీ20 టోర్నమెంట్ ఏర్పాటు చేస్తామన్నారు వివేక్ వెంకటస్వామి. ఈ సందర్భంగా ఉగ్రదాడిలో చనిపోయిన అమరవీరుల జవాన్లకు ప్లేయర్లు, వివేక్ వెంకటస్వామి కలిసి నివాళులు అర్పించారు.

ఆదిలాబాద్ జిల్లాలో వెలుగు టోర్నీలో ఇవాళ రెండు మ్యాచ్ లు జరిగాయి. మొదటి మ్యాచ్ లో ఆదిలాబాద్ వర్సెస్ నిర్మల్ టీమ్స్ తలపడ్డాయి. ఈ మ్యాచ్ లో నిర్మల్ జట్టుపై 46 పరుగుల తేడాతో ఆదిలాబాద్ విక్టరీ కొట్టింది. మొదట బ్యాటింగ్ చేసిన ఆదిలాబాద్ నిర్ణీత ఓవర్లలో 6వికెట్ల నష్టానికి 139 పరుగులు కొట్టింది. 140 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన నిర్మల్ 93 పరుగులు మాత్రమే చేసింది. ఆదిలాబాద్ టీంలో 6 వికెట్లు తీసిన హర్షద్ కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ అవార్డు దక్కింది.

రెండో మ్యాచ్ లో బోథ్ వర్సెస్ ముథోల్ మధ్య జరిగిన మ్యాచులో 7 వికెట్ల తేడాతో ముథోల్ విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన బోథ్ 107 చేసి ఆలౌట్ అయ్యింది. తర్వాత బ్యాటింగ్ కు దిగిన ముథోల్ 15 ఓవర్లలోనే టార్గెట్ ను ఫినిష్ చేసింది. 3 వికెట్లు కోల్పోయి… 110 రన్స్ కొట్టింది. హాఫ్ సెంచరీ చేసిన శహబాజ్ ఖాన్ కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది. ఆదిలాబాద్ జిల్లాలోని చాందా (టీ) సిరి కన్వెషన్ ప్లే గ్రౌండ్ లో జరుగుతున్న ఈ మ్యాచులకు.. ఆదిలాబాద్ ఎంపీ నగేష్, జెడ్పీ ఛైర్ పర్సన్ శోభారాణి హాజరయ్యారు. ప్లేయర్లను పరిచయం చేసుకున్నారు. గ్రామీణ క్రీడాకారులను వెలికి తీసేందుకు టోర్నీ నిర్వహించడం అభినందనీయమన్నారు.

రాజన్న సిరిసిల్ల జిల్లాలో జరిగిన వెలుగు టోర్నీలో సిరిసిల్ల, చొప్పదండి జట్లు విజయం సాధించాయి. సిరిసిల్ల జూనియర్ కాలేజ్ గ్రౌండ్స్ లో జరిగిన ఈ టోర్నీ తొలిమ్యాచ్ లో వేములవాడ, సిరిసిల్ల తలపడ్డాయి. వేములవాడ 18 ఓవర్లలో 97 రన్స్ చేయగా.. 15 ఓవర్లలోనే సిరిసిల్ల టార్గెట్ ఛేజ్ చేసింది. ఇక రెండో మ్యాచ్ లో కూడా వేములవాడ ఓటమిపాలైంది. చొప్పదండితో జరిగిన రెండో మ్యాచ్ లో 116 పరుగుల టార్గెట్ తో బరిలో దిగిన వేములవాడ.. 15 ఓవర్లలో కేవలం 60 రన్స్ మాత్రమే చేసింది.

Latest Updates