V6 వెలుగు టోర్ని: 9 ఫిబ్రవరి అప్డేట్స్

నల్గొండ జిల్లా మిర్యాలగూడలో వెలుగు టోర్నీ కొనసాగుతోంది. రెండోరోజు తొలి మ్యాచ్ లో హుజూర్ నగర్ పై మిర్యాలగూడ ఈజీ విక్టరీ సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన హుజూరాబాద్ 105 రన్స్ చేసి ఆలౌట్ అయింది. 106 పరుగుల టార్గెట్ తో బ్యాటింగ్ కు దిగిన మిర్యాలగూడ టీమ్ 11.1 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి విజయం సాధించింది.

నల్లగొండ జిల్లా మిర్యాలగూడలోని రాజీవ్ గాంధీ స్టేడియంలో వెలుగు క్రికెట్ టోర్నీని ప్రారంభించారు ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి, ఎమ్మెల్యే భాస్కర్ రావు. గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ఇలాంటి పోటీలు నిర్వహించడం అభినందనీయమన్నారు. ఆ తరువాత కాసేపు క్రికెట్ ఆడారు. తొలి మ్యాచ్ లో నాగార్జునసాగర్ పై మిర్యాలగూడ టీం ఘన విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన మిర్యాలగూడ నిర్ణీత ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి.. 167 పరుగులు కొట్టింది. 168 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన నాగార్జునసాగర్ టీం… 87 పరుగులకే ఆలౌట్ అయ్యింది.

సంగారెడ్డి జిల్లాలో వెలుగు క్రికెట్ టోర్నీ కొనసాగుతోంది. రెండోరోజు తొలి మ్యాచ్ లో పటాన్ చెరు జట్టుపై 5 వికెట్ల తేడాతో సంగారెడ్డి విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన పటాన్ చెరు 9 వికెట్లు కోల్పోయి 122 రన్స్ చేసింది. 123 రన్స్ టార్గెట్ తో దిగిన సంగారెడ్డి నాలుగు వికెట్లు కోల్పోయి 125 రన్స్ చేసింది. ఇక రెండో మ్యాచ్ లో నారాయణఖేడ్ పై జహీరాబాద్ 26 పరుగుల తేడాతో గెలిచింది. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన జహీరాబాద్ 6 వికెట్లకు 125 పరుగులు చేసింది. ఛేజింగ్ లో నారాయణఖేడ్ జట్టు 8 వికెట్లు కోల్పోయి 99 రన్స్ మాత్రమే చేయగలిగింది. తొలి మ్యాచ్ లో అజీజ్, రెండో మ్యాచ్ లో నితిన్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్ అందుకున్నారు.

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో వెలుగు క్రికెట్ టోర్నీ గ్రాండ్ గా జరుగుతోంది. తొలి మ్యాచ్ లో దేవరకద్ర పై 8 వికెట్ల తేడాతో గెలిచింది. మొదట బ్యాటింగ్ చేసిన దేవరకద్ర 5 వికెట్లు కోల్పోయి 105 రన్స్ చేయగా.. జడ్చర్ల టీమ్ 12 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 107 రన్స్ చేసి విజయం సాధించింది. 60 పరుగులు చేసిన జడ్చర్ల ప్లేయర్ మహేశ్వర్ కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది. రెండో మ్యాచ్ లోనూ దేవరకద్ర ఓడిపోయింది. జట్టు చేతిలో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన దేవరకద్ర 9 వికెట్లు కోల్పోయి 98 రన్స్ చేసింది. ఛేజింగ్ కు దిగిన మహబూబ్ నగర్ జట్టు 2 వికెట్లు కోల్పోయి టార్గెట్ ఛేజ్ చేసింది. 4 వికెట్లు తీసిన మహబూబ్ నగర్ ప్లేయర్ కయ్యూంకు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు వచ్చింది.

మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో వెలుగు క్రికెట్ టోర్నీ సెలక్షన్స్ జరిగాయి. సెలక్షన్స్ కి కుమ్రంభీం ఆసిఫాబాద్, కాగజ్ నగర్, బెల్లంపల్లి నియోజకవర్గాల నుంచి క్రీడాకారులు హాజరయ్యారు. ఇందులో అధికంగా మారుమాల ప్రాంతాల్లోని గిరిజన క్రీడాకారులు పాల్గొని తమ ప్రతిభ కనబరిచారు. వెలుగు తరపున టోర్నీ నిర్వహించడం సంతోషంగా ఉందన్న గిరిజన యువత.. అడవుల్లో క్రికెట్ ఆడే తమకు సత్తా చాటేందుకు మంచి అవకాశం వచ్చిందన్నారు. గ్రామీణ క్రీడాకారుల్లోని నైపుణ్యాన్ని..వెలుగు పత్రిక వెలుగులోకి తీసుకొస్తుందని..ఆటగాళ్లు, ప్రముఖులు మెచ్చుకుంటున్నారు.

Latest Updates