ఇండోనేషియా వ్య‌క్తుల‌పై కేసు న‌మోదు

రాజన్న సిరిసిల్ల జిల్లా : ఇండోనేషియా నుండి వచ్చిన విదేశీయులపై శుక్ర‌వారం పోలీసులు కేసు నమోదు చేశారు. గత నెలలో ఇండోనేషియా నుండి వేములవాడకు వచ్చిన విదేశీయులపై.. వీసా నిబంధనలు ఉల్లంఘించి, మసీదులో సమావేశం ఏర్పాటు చేసారని కేసు నమోదు చేశారు వేములవాడ పోలీసులు. ఇండోనేషియాకు చెందిన 12మంది విదేశీయులు, వారికి సహకరించిన ఏడుగురు వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు పోలీసులు.

 

Latest Updates