టీఆర్ఎస్ ఎమ్మెల్యేకి చుక్కెదురు.. చెన్నమనేని పౌరసత్వం రద్దు

టీఆర్ఎస్ ఎమ్మెల్యే  చెన్నమనేని రమేష్  భారత పౌరసత్వాన్ని రద్దు చేస్తూ కేంద్ర హోంశాఖ ప్రకటించింది.  వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ కు చుక్కెదురైంది. మోసపురితంగా భారత పౌరసత్వం పొందారంటూ హోమ్ శాఖకు ఆది శ్రీనివాస్  ఫిర్యాదు చేశారు. అప్పటి నుంచి భారత పౌరసత్వంపై  పోరాటం చేస్తూ వస్తున్నారు. అయితే తాజాగా చెన్నమనేనికి కేంద్ర ప్రభుత్వం షాకిచ్చింది. భారత పౌరసత్వానికి అనర్హుడంటూ హోంశాఖ ప్రకటించింది.

సిటిజన్ షిప్ యాక్ట్ 1995లోని సెక్షన్ 10కింద చెన్నమనేని పౌరసత్వాన్ని తొలగిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. రమేష్ పౌరసత్వంపై 2017లో కేంద్ర హోంశాఖ ఆదేశాలిచ్చింది. దీంతో చెన్నమనేని హైకోర్ట్ లో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఈ విషయంపై నిర్ణయం చెప్పాలని ఈ ఏడాది జులైలో కేంద్ర హోంశాఖకు హైకోర్ట్ ఆదేశాలు జారీ చేసింది. తాజాగా హైకోర్ట్ ఆదేశాలపై స్పందించిన కేంద్ర హోంశాఖ చెన్నమనేని పౌరసత్వాన్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది.

Latest Updates