జమునకు ‘వెండితెర దిగ్గజం’ పురస్కారం

సీనియర్​ నటి జమునకు వెండితెర దిగ్గజం పురస్కారాన్ని గురువారం ప్రదానం చేశారు. ప్రాజ్ఞిక ఫౌండేషన్​, సీల్ వెల్​ కార్పొరేషన్​ ఆధ్వర్యంలో రవీంద్రభారతిలో ఈ కార్యక్రమం జరిగింది. అతిథులుగా రాష్ట్ర పోలీసు హౌసింగ్​ కార్పొరేషన్​ చైర్మన్​ కోలేటి దామోదర్​, బేటీ బచావో.. బేటీ పడావో రాష్ట్ర కన్వీనర్​గీతామూర్తి, సీల్​వెల్​ సుబ్బారావు తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వ్యక్తలు మాట్లాడుతూ 65 ఏండ్ల సినీ జీవితం పూర్తి చేసుకున్న జమున అక్కినేని నాగేశ్వరరావు, జగ్గయ్య, ఎన్​టీఆర్​ తదితరులతో నటించి గుర్తింపు పొందిందన్నారు. సత్యభామ పాత్రలో ఆమె నటన మరిచిపోలేనిదని కొనియాడారు.

Latest Updates