వెనిజులా విడిచి పరుగులు పెడుతున్న జనం

వెనిజులా ఆయిల్ రిచ్ దేశం. ఒకప్పుడు బాగా బతికిన దేశం.అలాంటి వెనిజులాలో ఇవాళ దారుణమైన పరిస్థితులు నెలకొన్నాయి. పాలు, కూరగాయలు లాంటివి కొనలేకపోతున్నారు. జనం తిండికి కూడా నోచుకోలేకపోతున్నారు.  వెనిజులాలో ఉండలేని పరిస్థితులు వచ్చాయి.  దీంతో బ్రెడ్డు కోసం కూడా లూటీలు జరుగుతున్నాయంటే  అక్కడి పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.  వెనిజులాలో ఉండలేని పరిస్థతులు రావడంతో విపరీతంగా వలసలు పెరిగాయి. అయినకాడికి ఈన్నీ అమ్ముకుని ప్రజలు ఇతర ప్రాంతాలకు బయలుదేరుతున్నారు.  వీటన్నిటి ఫలితంగా ఈక్వెడార్ కు తాకిడి పెరిగింది.

వెనిజులా నుంచి కోకొల్లలుగా ప్రజలు ఈక్వెడార్ కు వలస పోతున్నారు.కనుచూపుమేరలో పరిస్థితి మెరుగుపడుతుందన్న దాఖలాలు కనపడకపోవడంతో మూటాముల్లె సర్దుకుని ఈక్వెడార్ కు వలస పోతున్నారు. వెనిజులా ప్రజలు ఇప్పటివరకు ఈక్వెడార్ వెళ్లాలంటే పాస్‌ పోర్టు, వీసా వంటి రూల్స్ పెద్దగా ఉండవు. కేవలం ఐడెంటిటీ కార్డులు చూపిస్తే సరిపోతుంది.  చాలా ఈజీగా వెళ్లిపోవచ్చు. అయితే కొన్ని వారాలుగా వెనిజులా నుంచి వలసలు పెరిగిపోవడంతో వీసా రూల్స్ మార్చి వాళ్లను కట్టడి చేయాలని ఈక్వెడార్ భావిస్తోంది. కొత్త వీసా రూల్స్ సోమవారం నుంచి అమల్లోకి వస్తాయి. కేవలం ఒకేఒక్క రోజు టైమ్ ఉండటంతో కొత్త   వీసా రూల్స్ రాకముందే  ఈక్వెడార్ కు వెళ్లిపోవాలని వెనిజులా ప్రజలు హైరానా పడుతున్నారు. గత వారం రోజుల నుంచి రోజుకు వేలాది మంది ఈక్వెడార్ కు పరుగులు తీస్తున్నట్లు లెక్కలు తేల్చి చెబుతున్నాయి.దీంతో ఈక్వెడార్ సరిహద్దుల్లో ఎక్కడ చూసిన వెనిజులా నుంచి వలస వస్తున్న వారే కనిపిస్తున్నారు. చాలా మంది పరిస్థితి దారుణంగా ఉంది. ఈక్వెడార్ వెళ్లడానికి   బస్ టికెట్ కొనడానికి కూడా డబ్బుల్లేవు. దీంతో ఇళ్లు, ఇళ్లలోని వస్తువులు, మొబైల్ సహా అందుబాటులో ఉన్న అన్ని  వస్తువులను అయినకాడికి అమ్ముకుని బస్ టికెట్లు కొంటున్నారు. వలస వెళుతున్న చాలా మందికి ఈక్వెడార్ వెళ్లి ఏం చేయాలన్న దానిపై ఎలాంటి ప్లాన్ కూడా లేదు. ముందు వెనిజులా నుంచి బయటపడితే అదే చాలనుకుంటున్నారు. ఈక్వెడార్ లో  తమ చదువుకు తగ్గ పని ఏదో ఒకటి దొరక్క పోదన్న ఆశతో ఉన్నారు. ఏదో ఒకటి చేసుకుని అక్కడ బతికేయవచ్చన్న ఆశతో సరిహద్దులు దాటుతున్నారు. జనవరి నుంచి ఇప్పటివరకు నాలుగు లక్షల మందికి పైగా వెనిజులా ప్రజలు ఈక్వెడార్ కు వలస వెళ్లినట్లు లెక్కలు తేల్చి చెబుతున్నాయి.

టెంట్లలో గుంపులుగుంపులుగా ….

ఈక్వెడార్ సరిహద్దుల్లో  ఎటు  చూసినా టెంట్లు, వాటిలో వందలాది మంది వెనిజులా ప్రజలే కనిపిస్తున్నారు.  పిల్లలు, ఆడవాళ్లు, ముసలి వాళ్లు అంతా ఆరుబయట ఈ గుడారాల్లోనే  చలికి వణుకుతూ కనిపిస్తున్నారు. తిండి కోసం కాస్తంత డబ్బు దాచుకుని టెంట్లలోనే  కాలం వెళ్లదీస్తున్నారు. ఈక్వెడార్ వెళ్లే లోగానే చేతిలో ఉన్న  డబ్బు అయిపోతే పిల్లాజెల్లాతో పస్తులుండాల్సిన దారుణ పరిస్థితి. అందుకే తినడానికి కూడా పదిసార్లు ఆలోచించి డబ్బు ఖర్చు పెడుతున్నారు.

వలసలకు కూడా  లిమిట్ ఉంటుంది

వెనిజులా నుంచి వచ్చేవారి కోసం వీసా రూల్స్ ను మార్చబోతున్నట్లు దాదాపు రెండు నెలల కిందటే ఈక్వెడార్ చెప్పింది. అడ్డూ అదుపూ లేకుండా వస్తున్న వెనిజులా ప్రజలను కట్టడి చేయడానికే  రూల్స్ ను మార్చాలని నిర్ణయించుకున్నట్లు  ఈక్వెడార్ ప్రెసిడెంట్  చెప్పారు. “దేనికైనా ఒక లిమిట్ ఉంటుంది” అన్నారాయన. కోకొల్లుగా వస్తున్న వెనిజులా ప్రజలను చూసి ఈక్వెడార్ భయపడిపోతోంది. దీంతో సోమవారం నుంచి సరైన పాస్ పోర్టు, వీసా ఉంటేనే కానీ దేశంలోకి ఎంట్రీ ఇచ్చేది లేదని ఈక్వెడార్ తేల్చి చెప్పింది.

ఇంతకుముందే పెరూ, చిలీ….

దేశంలో పరిస్థితులు బాగా లేకపోవడంతో గతంలో పెరూ, చిలీ సహా అనేక దేశాలకు వెనిజులా ప్రజలు వలస వెళ్లారు. వలసలు పెద్ద సంఖ్యలో ఉండటంతో వీటిని  కట్టడి చేయడానికి  ఆ దేశాలు  వీసా రూల్స్ మార్చాయి. లేటెస్ట్ గా ఈ జాబితాలో ఈక్వెడార్ కూడా చేరింది.

ఈక్వెడార్ నిర్ణయాన్ని తప్పుపట్టిన యూఎన్​

వెనిజులా వలసలను కంట్రోల్ చేయడానికి కొత్త వీసా రూల్స్ ను తీసుకురావాలన్న  ఈక్వెడార్ ప్రభుత్వ నిర్ణయాన్ని  యునైటెడ్ నేషన్స్ రిఫ్యూజీ ఏజెన్సీ తప్పుపట్టింది. కొత్త వీసా రూల్స్ వల్ల వలసలు ఆగుతాయనుకోవడం భ్రమేనని రిఫ్యూజీ ఏజెన్సీ అధికారులు చెప్పారు. వీసాలు రానివారంతా ఈక్వెడార్ లోకి  అక్రమంగా ప్రవేశించడానికి ప్రయత్నించే అవకాశాలున్నాయన్నారు. వెనిజులా ప్రజలకు వేరే దేశాలకు వెళ్లడం మినహా మరో దారి  లేదన్నారు.

ఫలితమివ్వని హ్యుగో చావెజ్ మార్పులు

హ్యుగో చావెజ్ 1998 లో వెనిజులా ప్రెసిడెంట్ గా ఎన్నికయ్యారు. సంక్షోభం నుంచి దేశాన్ని  గట్టెక్కించడానికి హ్యుగో చావెజ్ అనేక మార్పులు  తీసుకువచ్చారు. కానీ ఇవేవీ ఫలితాలనివ్వలేదు. చావెజ్ అమలు చేసిన సోషలిస్టు విధానాలే దేశాన్ని ఆర్థికంగా దెబ్బతీశాయన్నది ఎనలిస్టుల వాదన. చావెజ్ చనిపోయిన తర్వాత అధికారంలోకి వచ్చిన నికోలస్ మదురో కూడా వెనిజులా ను ఈ పరిస్థితి నుంచి బయటకు తీసుకురాలేకపోయారు. చావెజ్ విధానాలనే మదురో  కొనసాగించారు. దీని ఫలితంగా ప్రజలు రోజువారి అవసరమైన మిల్క్ ,  ఫ్రూట్స్  వంటివి కూడా కొనలేని దారుణ పరిస్థితులు నెలకొన్నాయి. దీనికి తోడు ప్రతిపక్ష నాయకుడు జువాన్ గైడో, ప్రెసిడెంట్ మదురో మధ్య పొలిటికల్ వార్ మొదలైంది. గైడో కు అమెరికా మద్దతు  దొరికింది. మదురోకు   చైనా, రష్యా దేశాలు అండగా నిలిచాయి. ఆ దేశ పాలకులకు విజన్ లేకపోవడమే ప్రధానంగా వెనిజులాలో  ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులకు కారణమని ఎనలిస్టులు అంటున్నారు.

ఈ పరిస్థితికి ఎన్నో కారణాలు

వెనిజులా పరిస్థితి ఇంత దారుణంగా ఉండటానికి చాలా కారణాలున్నాయి. అటు పాలిటిక్స్ లోనూ ఇటు ఎకానమీలోనూ భయంకరమైన పరిస్థితులు ఏర్పడ్డాయి.ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు హ్యూగో చావెజ్ అమలు చేసిన విధానాలు వెనిజులా ఆర్థిక వ్యవస్థను ఘోరంగా దెబ్బతీశాయి. ధరలు విపరీతంగా పెరిగాయి. కూరగాయలు, పాలు, పండ్లు వంటివి కూడా కొనుక్కోలేని పరిస్థితి. అక్కడ కూరగాయలు, పాలు కొనాలంటే కుర్చీనో, టేబుల్​నో కొన్నంత ధరలు ఉన్నాయి. ఎటు చూసినా  తినడానికి తిండి లేని పరిస్థితి నెలకొంది. తిండి కోసం  చోరీలు, నేరాలు పెరిగాయి. దేశంలో ఆకలి చావులు మొదలయ్యాయి. సరైన మందుల్లేక పిల్లలు, ముసలివాళ్లు చనిపోవడం మామూలైంది. ఆస్పత్రుల్లో మందులకు బాగా  కొరత ఏర్పడింది. షాపుల్లోనూ మందుల్లేవు. దీనికితోడు ఇక్కడ బతకలేక గత నాలుగేళ్లలో 13 వేల మంది

ఒకప్పటి సంపన్న దేశం

ఒకప్పుడు సంపన్న దేశంగా  ఉన్న వెనిజులా లాటిన్​ అమెరికా దేశాల్లో ఒకటి. రాజధాని కరాకస్  నగరం. స్పానిష్  అధికార భాష. ప్రపంచంలోనే  పెద్ద ఎత్తున ఆయిల్ నిల్వలు ఇక్కడ ఉన్నాయి. టూరిస్టు స్పాట్ గా కూడా వెనిజులాకు మంచి పేరు ఉంది. ఇక్కడి మార్గరిటా ఐలాండ్ కు ప్రతి ఏడాది పెద్ద సంఖ్యలో టూరిస్టులు వస్తుంటారు. లాటిన్ అమెరికా దేశాల్లో పెద్ద ఎత్తున అర్బనైజేషన్ జరిగిన దేశాల్లో వెనిజులా ఒకటి.దేశ జనాభాలో 93 శాతం మంది నార్త్ వెనిజులాలో ఉంటారు.

Latest Updates