వరంగల్ పై నాకు ప్రత్యేకమైన అభిమానం

విద్యా, సంస్కృతి, సాహిత్య రంగాలకు వరంగల్ పుట్టినిల్లన్నారు ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు. వరంగల్ పై తనకు ప్రత్యేకమైన అభిమానం ఉందన్నారు. విద్యార్థి దశలో ఎక్కువగా వరంగల్ లో తిరిగానని చెప్పారు. నీటి పారుదల రంగంలో తెలంగాణ ప్రభుత్వ కృషి అభినందనీయమన్న వెంకయ్య.. మంత్రిగా ఉన్నపుడు  స్మార్ట్, హృదయ్ కింద వరంగల్ ను చేర్చానని చెప్పారు. మాతృ భాషలో విద్యతోనే వికాసం ఉందని.. మాతృభాష, మాతృదేశం, గురువులను మరవొద్దన్నారు. వరంగల్ లో ఏవీవీ కాలేజీ ప్లాటినం జూబ్లీ వేడుకలను ప్రారంభించారు వెంకయ్య.  కార్యక్రమంలో మంత్రులు మహమూద్ అలీ, ఎర్రబెల్లి దయాకర్ రావు పాల్గొన్నారు.

Latest Updates