కేంద్ర మంత్రిపై వెంకయ్య నాయుడు సీరియస్

పార్లమెంట్ కు హాజరు కాని ఓ కేంద్ర మంత్రికి అక్షింతలు వేశారు రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయుడు. కేంద్ర పశు సంవర్ధక సహాయ మంత్రి సంజీవ్ కుమార్ బలయాన్ బుధవారం పార్లమెంట్ కు హాజరుకాలేదు. ఆ రోజు ఆయన పేరు ఎజెండాలో ఉంది. దీంతో  సభాపతి వెంకయ్యనాయుడు మాట్లాడుతూ… బుధవారం నాడు బలయాన్ సభకు హాజరుకాలేదని.. సమస్యలు చర్చించడానికి కొందరు ఎంపీలు మీకోసం ఎదురు చూశారని అన్నారు.  మరో సారి  ఇలాంటి పరిస్థితిని తీసుకురాకండి అని హెచ్చరించారు.

ప్రధాని మోడీకూడా పార్లమెంట్ కు హాజరుకాని మంత్రుల లిస్ట్ ను తన చాంబర్ కు పంపించాల్సిందిగా కోరారు. కొన్ని శాఖల మంత్రులకు సంబంధించిన ప్రశ్నలను ఎంపీలు అడుగుతున్నప్పుడు ఆయా మంత్రులు సభలో ఉండకపోవడాన్ని ప్రధాని మోడీ సీరియస్ గా తీసుకున్నారు.

Latest Updates