ఆర్థిక పురోగతిలో హెచ్చుతగ్గులు తప్పవు: వెంకయ్యనాయుడు

ఆర్థిక  పురోగతి  సాధించే  క్రమంలో.. కొన్ని హెచ్చుతగ్గులు  ఉంటాయన్నారు ఉపరాష్ట్రపతి  వెంకయ్యనాయుడు. అందువల్ల..  తాత్కాలికంగా  కొన్ని ఇబ్బందులు  తలెత్తినా.. దీర్ఘకాలికంగా   మంచి ప్రయోజనాలు  చేకూరతాయని తెలిపారు . ప్రపంచం  మొత్తం  భారత్ వైపు  చూస్తోందన్న వెంకయ్య.. కేంద్ర, రాష్ట్ర  ప్రభుత్వాలు  కలిసికట్టుగా  పని  చేసినప్పుడే  దేశం అభివృద్ధి చెందుతున్నారు . గచ్చిబౌలిలోని  ఇండియన్ బిజినెస్  స్కూల్ లో  జరిగిన దక్కన్  డైలాగ్  సెకండ్  ఎడిషన్  కాన్ఫరెన్స్ ను.. ఉపరాష్ట్రపతి  ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో  కేంద్రమంత్రి  మురళీధరన్ తో  పాటు  మంత్రి  నిరంజన్ రెడ్డి,  ఏపీ ఐటీ  శాఖ  మంత్రి  మేకపాటి  గౌతమ్ రెడ్డి పాల్గొన్నారు.

Latest Updates