విజయవాడ-గూడూరు మధ్య ఇంటర్‌ సిటి ఎక్స్‌ప్రెస్‌

ఆంధ్రప్రదేశ్ లో మరో ఎక్స్ ప్రెస్ రైల్ ప్రారంభం కానుంది. విజయవాడ నుంచి గూడూరు మధ్య ఇంటర్ సిటి ఎక్స్ ప్రెస్ రైల్ ను రేపు(ఆదివారం) ఉపరాష్ట్ర పతి వెంకయ్యనాయుడు ప్రారంభించనున్నారు. ఈ రైలు గూడూరులో ఉదయం 6 గంటలకు బయలుదేరి ఉదయం 10.30 గంటలకు విజయవాడకు చేరుతుంది. మళ్లీ విజయవాడ నుంచి సాయంత్రం 6.10 గంటలకు బయలుదేరి రాత్రి 10.40 గంటలకు గూడూరుకు చేరుతుంది. నెల్లూరు, కావలి, సింగరాయకొండ, ఒంగోలు, చీరాల, బాపట్ల, తెనాలి లో ఈ రైలు ఆగుతుంది. ఈ కార్యక్రమంలో కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రి సురేశ్‌ అంగడి కూడా పాల్గొననున్నారు.

Latest Updates