‘హే దోనో తోడు దొంగలు హై..’ వెంకీమామ ట్రైలర్ రిలీజ్

విక్టరీ వెంకటేశ్‌, నాగచైతన్య హీరోలుగా నటించిన మల్టీ స్టారర్ సినిమా వెంకీమామ.  శనివారం ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ ను విడుదల చేసింది చిత్ర యూనిట్. ‘మనిషి తలరాతను రాసే శక్తి దేవుడికి ఉందని మీ నమ్మకం. ఆ రాతను తిరిగిరాసే శక్తి మనిషికి ఉందని నా నమ్మకం’ అని వెంకటేష్ చెప్పే పవర్ ఫుల్  డైలాగ్‌తో ట్రైలర్‌ మొదలైంది. రియల్ లైఫ్ లో మామా అల్లుళ్లైన వెంకీ, చైతూ లు ఈ సినిమాలో కూడా మామాఅల్లుళ్లుగా నటించారు.  మామ పెళ్లి కోసం ఆరాటపడుతున్న అల్లుడి పాత్రలో చైతూ నవ్వులు తెప్పించాడు.సినిమాలో జవాన్ గా కనిపించనున్నాడు. ట్రైలర్ చూస్తే చిత్రంలో యాక్షన్ పార్ట్ తో కామెడీ కూడా ఉందని అర్ధమవుతోంది.

‘జైలవకుశ’ తర్వాత బాబీ  దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో రాశీఖన్నా, పాయల్‌ రాజ్‌పుత్‌ హీరోయిన్లుగా నటించారు.   ప్రకాష్ రాజ్, నాజర్, రావు రమేష్, గీత లు కీలకపాత్రల్లో నటించారు.  డిసెంబర్‌ 13న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Latest Updates