గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన వెంకీ : ప్రేమించిన వ్యక్తితోనే కూతురి పెళ్లి

F2 సినిమాతో ఈ ఏడాది బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న విక్టరీ వెంకటేష్ ఇంట్లో త్వరలో పెళ్లి బాజాలు మోగనున్నాయి. ‘ప్రేమ, ప్రేమతో రా.. ప్రేమించుకుందాం రా.. పెళ్లి చేసుకుందాం.. ప్రేమంటే ఇదేరా.. ’ లాంటి లవ్ స్టోరీస్ సినిమాలకు ఆయన పెట్టింది పేరు. రీల్ లైఫ్‌ లో ప్రేమ కథల్ని బాగా పండించిన విక్టరీ వెంకటేష్.. రియల్ లైఫ్‌ లోనూ తన కూతురు ప్రేమ వివాహానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. వెంకటేష్ పెద్ద కూతురు అశ్రిత పెళ్లి పీట‌లెక్క‌బోతుంది. ఆమె ఎంగేజ్ మెంట్ వేడుక ఫిబ్రవరి 6న చాలా సైలెంట్‌ గా జరిపినట్టు టాలీవుడ్ టాక్.

హైదరాబాద్ రేస్ క్లబ్ చైర్మన్ సురేందర్ రెడ్డి మనవడితో గత కొంతకాలంగా ప్రేమలో ఉన్న ఆశ్రిత.. ఈ విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలియజేయడంతో.. పెద్దలు పెళ్లికి ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. వెంకటేష్ అన్న సురేష్ బాబు.. సురేందర్ రెడ్డి ఇంటికి వెళ్లి పెళ్లి ఖాయం చేసుకున్నారన్న వార్తలు అప్పట్లో వచ్చాయి. అబ్బాయి తండ్రి రఘురామి రెడ్డి మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి మంచి స్నేహితుడు కావడంతో.. ఈ పెళ్లి పెద్దల నుండి గ్రీన్ సిగ్నల్ లభించింది. మార్చి 1న అశ్రిత పెళ్లి వేడుకను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగున్నాయట. ఇరు కుటుంబాల నుండి ఈ పెళ్లి కబురు అధికారికంగా త్వరలోనే వెల్లడయ్యే అవకాశం ఉందంటున్నారు. ఎఫ్ 2 తో బ్లాక్ బస్టర్ కొట్టిన వెంకటేష్ మంచి జోష్ మీదుండగా ఈ పెళ్లి వేడుకతో మరింత సంతోషం వెళ్లి విరియనుంది దగ్గుబాటి కుటుంబంలో..

Latest Updates