‘నారప్ప’ రచ్చ : మా వాళ్లే రియల్‌‌ హీరోలు..!

సోషల్ మీడియా ఫ్యాన్స్‌‌ మధ్య వార్‌‌కి పర్ఫెక్ట్‌‌ అడ్డా. స్టార్‌‌ హీరోల సినిమాలు రిలీజ్‌‌ అయినప్పుడు.. ఒకరినొకరు తిట్టుకోవడం సర్వసాధారణంగా మారింది. వద్దని స్వయంగా హీరోలే వారిస్తున్నా సద్దుమణగని పరిస్థితులు కనిపిస్తున్నాయి. అయితే ఇంతకాలం ఒకే భాషలోని హీరోల అభిమానుల మధ్య ఈ తరహా ‘వర్డ్‌‌ వార్‌‌’ని చూశాం. కానీ, ఇప్పుడది రీమేక్‌‌లకు అంటుకుంది. ‘అసురన్‌‌’ తెలుగు రీమేక్‌‌ ‘నారప్ప’ ఫస్ట్‌‌ లుక్‌‌తో కోలీవుడ్‌‌, టాలీవుడ్‌‌ ఫ్యాన్స్‌‌ మధ్య ట్విట్టర్‌‌ వేదికగా వాదులాట జరిగింది.

#UnrivalledTamilActors, #TelugurealHeroes..  ఈ రెండు హ్యాష్‌‌ ట్యాగ్‌‌లు నిన్న ట్విట్టర్‌‌లో ట్రెండ్‌‌ అయ్యాయి. మా హీరోలకు ఎదురేలేదంటూ తమిళ తంబీలు, మా వాళ్లే రియల్‌‌ హీరోలంటూ తెలుగు తమ్ముళ్లు వరుస పోస్టులతో చెలరేగిపోయారు.  హీరో, కమెడియన్‌‌  అనే తేడా లేకుండా రెండు భాషల్లోని యాక్టర్ల ఫొటోలను తెర మీదకు తెచ్చి ట్రోలింగ్‌‌ చేశారు. దీంతో ఆ రెండు హ్యాష్‌‌ ట్యాగ్‌‌లు టాప్‌‌ ట్రెండింగ్‌‌లో కొనసాగాయి. పరిస్థితి శ్రుతిమించడంతో కొందరు అభిమానులు మిగతా వాళ్లను శాంతింపజేసేందుకు ప్రయత్నించారు. మధ్య మధ్యలో పాజిటివ్‌‌ పోస్టులతోనే ఈ ట్రెండ్స్‌‌ని కొనసాగించడం విశేషం. హీరోలంటే అభిమానం ఉండాలే తప్ప.. ఇలా ఓపెన్‌‌గా తన్నుకోవడం మంచిది కాదని కొందరు సలహా ఇచ్చారు. భాష ఏదైనా సరే సినిమా బాగుంటే.. బాగుందని స్టేట్‌‌మెంట్‌‌ ఇచ్చిన హీరోలున్నారనే విషయాన్ని గుర్తు చేశారు మరికొందరు. ఇంకొందరు మాత్రం ఇవేం పట్టనట్లు ఈ వ్యవహారాన్ని ఎంజాయ్‌‌ చేశారు.  మొత్తానికి ఉదయాన్నే మొదలైన ‘సాంబార్‌‌ వర్సెస్‌‌
బిర్యానీ’ గోల.. అభిమానులు శాంతించడంతో సాయంత్రానికల్లా చల్లబడింది.

Latest Updates