రాశీకి వెంకీమామ బర్త్ డే గిఫ్ట్

బాబీ డైరెక్షన్ లో వెంకటేష్, నాగచైతన్య హీరోలుగా నటిస్తున్న సినిమా వెంకీమామ. పాయల్ రాజ్ పుత్, రాశీఖన్నా హీరోయిన్లు. నేడు హీరోయిన్ రాశీఖన్నా బర్త్ డే సందర్భంగా ఆమెకు సర్ ఫ్రైజ్ గిఫ్ట్ ఇచ్చింది వెంకీమామ యూనిట్. ఈ మూవీలో ఆమె నటించిన కొన్ని సీన్స్ ని వీడియో రూపంలో రిలీజ్ చేసింది. ఈ వీడియోలో నీతో ఒక బ్యూటిఫుల్ లైఫ్ ను ఊహించుకున్నాను అని రాశీఖన్నా నాగచైతన్యతో అంటుంది. ఈ వీడియోకు ఫ్యాన్స్ నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది.

ఇప్పటికే రిలీజైన టీజర్, సాంగ్స్ కు మంచి రెస్పాన్ రాగా..ఇవాళ వచ్చిన రాశీఖన్నా బర్త్ డే స్పెషల్ వీడియోతో సినిమాకు మరింత గ్లామర్ వచ్చిందంటున్నారు. సురేష్ ప్రొడక్షన్స్, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీలు నిర్మిస్తున్న ఈ సినిమాను సంక్రాతికి రిలీజ్ చేయాలని టీం ప్లాన్ చేస్తోంది. అయితే దీనిపై అఫీషియల్ అనౌన్స్ మెంట్ రావాల్సి ఉంది.

Latest Updates