వెంకీమామకి బర్త్‌ డే గిఫ్ట్

ఫ్యాన్స్ కి సర్ ఫ్రైజ్ గిఫ్ట్ అందించాడు విక్టరీ వెంకటేష్. ఈ డిసెంబర్-13న వెంకటేష్ బర్త్ డే. అయితే ఈ పుట్టిన రోజునే వెంకీమామ రిలీజ్ చేస్తున్నట్లు అనౌన్స్ చేసి అందరినీ ఆశ్యర్యపరిచింది యూనిట్. ఇప్పటివరకు రిలీజ్ డేట్ తెలపని యూనిట్ ఒకేసారి రిలీజ్ డేట్ ఇచ్చి , వెంకీకి నిజమైన బర్త్ డే గిఫ్ట్ ఇచ్చింది. దీంతో వెంకీ ఫ్యాన్స్ కి 2 పండుగలు ఒకేసారి వచ్చాయన్నమాట.

నాగ చైతన్య- వెంకీ కలిసి నటించిన ఈ మూవీని ఫస్ట్ సంక్రాంతికి రిలీజ్ చేయనున్నట్లు వార్తలు వచ్చాయి. సడెన్ గా వెంకీ బర్త్ డేకు మార్చారు. ఇప్పటికే చైతూ, రాశి బర్త్‌‌ డేస్‌‌కి ఇద్దరి టీజర్లనూ రిలీజ్ చేసిన టీమ్.. వెంకటేష్ పుట్టినరోజుకి సినిమానే విడుదల చేసేందుకు ప్లాన్ చేశారు. ఈ విషయాన్ని ప్రకటిస్తూ రానా, డైరెక్టర్ బాబి ఓ వీడియోను కూడా పోస్ట్ చేశారు. ఇప్పటి వరకూ ఈ సినిమా విషయంలో వచ్చిన ప్రతి అప్‌‌డేట్‌‌కీ మంచి స్పందన రావడంతో అంచనాలు పెరిగాయి. వెంకీ సరసన పాయల్ రాజ్ పుత్ హీరోయిన్ గా నటించిన ఈ మూవీని సురేష్ ప్రొడక్షన్స్, పీపుల్స్ మీడియా కలిసి నిర్మించిన విషయం తెలిసిందే.

Latest Updates