‘వెంకీమామా‘ అదుర్స్..పంచెకట్టులో మామాఅల్లుళ్లు

రీయల్ లైఫ్ మామా అల్లుళ్లు విక్టరీ వెంకటేశ్,నాగచైతన్య రీల్ లైఫ్ లో నటిస్తున్న మూవీ వెంకీమామా. వినాయక చవితి సందర్భంగా తెలుగు ప్రజలకు విషెష్ చెబుతూ న్యూ పోస్టర్ ను రిలీజ్ చేశారు.ఈ పోస్టర్ లో వెంకటేశ్,నాగచైతన్య అచ్చమైన తెలుగు తనంతో  పంచెకట్టులో మెరిసిపోతున్నారు. వైట్ అండ్ రెడ్ కాంబినేషన్ లో పంచెకట్టుతో ఒకరిపై ఒకరు భుజాలపై చేతులేసి చిరునవ్వులతో ఉన్న పోస్టర్  ఇంట్రెస్టింగ్ గా ఉంది. సురేష్ ప్రొడక్షన్స్, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న ఈ మూవీకి కేఎస్ రవీంద్ర(బాబీ) డైరెక్షన్ చేస్తున్నారు. వెంకటేశ్, నాగచైతన్యకు జోడీగా పాయల్ రాజ్ పూత్,రాశీఖన్నా నటిస్తున్నారు.థమన్ మ్యూజిక్ అందిస్తున్నారు.

Latest Updates