ఎవరెస్ట్ అంచులో మహేష్ ఫ్యాన్స్

వంశీ పైడిపల్లి డైరెక్షన్ లో ప్రిన్ప్ మహేష్ బాబు హీరోగా నటిస్తున్న సినిమా మహర్షి. ఈ మూవీ మే-9న రిలీజ్ కానుండగా..ప్రమోషన్స్ లో స్పీడ్ పెంచింది యూనిట్. ఈ క్రమంలోనే శుక్రవారం మహర్షి సినిమాలోని ఓ సాంగ్ టీజర్ ను రిలీజ్ చేశారు.  హీరోయిన్‌ పూజా హెగ్డే, హీరో మహేష్‌పై  షూట్ చేసిన ‘ఎవరెస్ట్‌ అంచున’  డ్యూయెట్‌ సాంగ్‌ వీడియో ప్రివ్యూ అభిమానులను ఆకట్టుకుంటోంది. చిన్మయి శ్రీపాద, దేవీశ్రీ ప్రసాద్ ఈ సాంగ్ పాడారు.  ఇప్పటికే విడుదలైన టీజర్‌ ఆకట్టుకోగా..శుక్రవారం వచ్చిన ఎవరెస్ట్ సాంగ్ ప్రొమో సినిమాకు మరింత హైప్ తెచ్చిందంటున్నారు అభిమానులు.  మహర్షి సినిమాలో అల్లరి నరేష్ కూడా నటిస్తున్న విషయం తెలిసిందే.

Latest Updates