వెటరన్ యాక్టర్ సౌమిత్ర ఛటర్జీ (85) కన్నుమూత

కోల్‌‌కతా: వెటరన్ బెంగాలీ యాక్టర్ సౌమిత్ర ఛటర్జీ (85) ఆదివారం తుదిశ్వాస విడిచారు. అక్టోబర్ 6న ఆయనకు కరోనా పాజిటివ్‌‌గా తేలింది. గత నెల రోజులుగా కోల్‌‌కతాలోని బెల్లెవ్యూ నర్సింగ్ హోమ్‌‌లో సౌమిత్ర చికిత్స పొందుతున్నారు. కరోనా నెగిటివ్‌‌గా తేలిన తర్వాత నాన్ కోవిడ్ ఇంటెన్సివ్ తరౌమా యూనిట్‌‌కు ఆయనను షిఫ్ట్ చేశారు. సుదీర్ఘ కెరీర్‌‌లో దాదా సాహెబ్ ఫాల్కే, పద్మ భూషణ్ అవార్డులతోపాటు పలు ప్రతిష్టాత్మక అవార్డులను సౌమిత్ర ఛటర్జీ సొంతం చేసుకున్నారు. 2018లో ఫ్రాన్స్ అత్యున్నత పౌర పురస్కారం లీజియన్ ఆఫ్ హానర్‌‌ను కూడా ఆయన దక్కించుకున్నారు. లెజెండరీ డైరెక్టర్ సత్యజిత్ రే-సౌమిత్ర కాంబినేషనల్‌‌లో వచ్చిన కొన్ని సినిమాలు ప్రేక్షకులను ఉర్రూతలూగించాయి. ఆషానీ సంకేత్, ఘరే బైరే, అరణ్యేర్ దిన్ రాత్రి, చారులత, షఖ ప్రోష్ఖా, ఝిందర్ బండి, సాత్ పాకే బంధా లాంటి మూవీలతో అభిమానుల మనసుల్లో సౌమిత్ర ప్రత్యేక ముద్ర వేశారు.

Latest Updates