మా ఇంటికి ఎవరూ రావొద్దు..వెటర్నరీ డాక్టర్ ఇంటికి తాళం

షాద్ నగర్లో దారుణ హత్యకు గురైన వెటర్నరీ డాక్టర్ ఘటనపై దేశ వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఈ దారుణానికి పాల్పడిన వారిని ఉరితీయాలంటూ డిమాండ్  చేస్తున్నారు. నిందితులను ఉరితీస్తేనే వారికి న్యాయం జరుగుతుందంటున్నారు. బాధితురాలి నివాసం నక్షత్ర కాలనీ వద్ద కాలనీ వాసులు, స్థానికులు ఆందోళనకు దిగారు. వారి ఇంట్లోకి వెళ్లకుండా కాలనీ గేట్ కు తాళం వేసి బైఠాయించారు. బాధితురాలికి న్యాయం జరిగే వరకు ఇంట్లోకి ఎవరూ వెళ్లకూడదంటూ బోర్డులు పట్టుకున్నారు. పరామర్శలు వద్దని..న్యాయం కావాలని కోరుతున్నారు. రాజకీయ నాయకులు, మీడియా ,పోలీసులు ఎవరూ రావొద్దని వేడుకున్నారు. బాధితురాలి కుటుంబానికి న్యాయం జరిగే వరకు అనుమతించబోమన్నారు స్థానికులు.

Latest Updates