వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ ప్లాన్‌ను లాంచ్‌ చేసిన వీఐ

ముంబై: భారతీ ఎయిర్‌టెల్‌, రిలయన్స్‌ జియోకు పోటీగా మరో వర్క్‌ ఫ్రమ్‌ హోం ప్లాన్‌ను ఆవిష్కరించింది. రూ. 351తో కొత్త ప్రీపెయిడ్‌ రీఛార్జ్‌ ప్లాన్‌ను విడుదల చేసింది. ఈ ప్లాన్ వాలిడిటీ 56 రోజులు. కస్టమర్లు 100జీబీ 4జీ డేటాను పొందుతారు. ఈ కొత్త ప్లాన్‌ను వీఐ వెబ్‌సైట్‌లోని యాడ్‌ ఆన్‌ సెక్షన్‌లో చూడొచ్చు. నూతన రీఛార్జ్‌ ప్లాన్‌ కొన్ని సర్కిళ్లలో మాత్రమే అందుబాటులో ఉన్నట్లు తెలుస్తున్నది. ఈ ఏడాది ఆరంభంలోనే వొడాఫోన్‌ ఐడియా తొలిసారి వర్క్‌ ఫ్రమ్‌ హోం ప్లాన్‌ను తీసుకొచ్చింది. టెలికాం కంపెనీ వొడాఫోన్‌ ఐడియా లిమిటెడ్‌ (వీఐఎల్‌) ‘వీఐ’ బ్రాండ్‌తో ఇటీవల వినియోగదారుల ముందుకొచ్చిన విషయం తెలిసిందే.

Latest Updates