విలువలుగల సమాజంతోనే నేరాలు ఆగుతాయి: వెంకయ్య నాయుడు

విలువలుగల సమాజంతోనే నేరాలు ఆగుతాయన్నారు ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు. జూబ్లీహిల్స్ లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్ధ లో 94వ అల్ ఇండియా సర్వీస్, సెంట్రల్ సివిల్ సర్వీస్ ఆఫీసర్స్ ఫౌండేషన్ కోర్సు ముగింపు కార్యక్రమంలో మాట్లాడిన ఆయన…ఇటీవల జరిగిన సంఘటనలు కలిచివేస్తున్నాయన్నారు. కొత్త చట్టాలు తీసుకొచ్చినంత మాత్రాన సమస్య పరిష్కారం కాదని చెప్పారు.  ప్రజల్లో మార్పు రానంతవరకు చట్టాలు సమాజాన్ని ప్రభావితం చేయలేవని తెలిపారు.

భారతీయ సంసృతి ఎంతో పురాతనమైనదని, విలువలుగలదని దాన్ని విడవడంవల్లే సమస్యలు వస్తున్నాయని చెప్పారు వెంకయ్య నాయుడు. సమాజంలో మార్పురావాలని, నేరాలు అత్యాచారాలు ఆగాలని కోరారు. ప్రకృతి, సంస్కృతి మన భవిష్యత్ అని… ప్రపంచదేశాలు మనల్ని గౌరవించడానికి కారణం మన విలువలేనని అన్నారు. వాటిని ఎప్పటికీ వీడవద్దని కాపాడుకోవాలని చెప్పారు.

Latest Updates