అత్యంత సన్నిహితుల్లో జైట్లీ ఒకరు: వెంకయ్యనాయుడు

బీజేపీ సీనియర్ నేత,కేంద్ర మాజీ మంత్రి అరుణ్‌జైట్ల మృతి పట్ల ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు సంతాపం తెలిపారు. చెన్నై పర్యటనలో ఉన్న ఆయన వెంటనే ఢిల్లీ బయల్దేరారు. అరుణ్‌ జైట్లీ తనకు దీర్ఘకాల మిత్రుడని, అత్యంత సన్నిహితుల్లో ఒకరని అన్నారు. జైట్లీ మృతి దేశానికి, వ్యక్తిగతంగా తనకు కూడా తీరని లోటన్నారు. అని చెప్పారు. జీఎస్టీ తీసుకురావడంలో జైట్లీ  కీలక పాత్ర పోషించారని, పన్ను విధానంలో సమూల మార్పులకు ఆయన కృషి చేశారని అన్నారు. జైట్లీ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు వెంకయ్యనాయుడు.

Latest Updates