చదువు జాబ్ ‌‌కోసమే అనుకోవద్దు

న్యూఢిల్లీ, వెలుగు: ఎడ్యుకేషన్ ను ఉద్యోగ, ఉపాధి అవకాశాలకు సాధనంగా మాత్రమే భావించొద్దని, దానిని జ్ఞానాన్ని పెంచే శక్తిగా చూడాలని ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు సూచించారు. స్టూడెంట్లలో చిన్నతనం నుంచే మంచి, చెడులను బేరీజు వేసుకునే సామర్థ్యాన్ని పెంపొందింపజేయాల్సిన అవసరం ఉందన్నారు. సోమవారం ఢిల్లీలోని ఉపరాష్ట్రపతి భవన్ ‌‌‌‌నుంచి ఆన్‌‌‌‌లైన్లో ‘టైమ్స్ స్కాలర్స్ ఈవెంట్’ను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. వాస్తవాలను తెలుసుకుని అలవర్చుకోవాలని, అసత్యాలను గుర్తించి దూరంగా ఉండాలని సూచించారు. స్టూడెంట్లలో బుక్ రీడింగ్ పై ఆసక్తి తగ్గిపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం ..

Latest Updates