స్ట్రీట్ చిల్డ్రన్స్ పై డిజిటల్ ఎగ్జిబిషన్

న్యూఢిల్లీ: ఇండియాలోని వీధి బాలల జీవితాలపై ఫొటోగ్రాఫర్ వికీ రాయ్ ఏర్పాటు చేసిన డిజిటల్ ఎగ్జిబిషన్ ను సేవ్ ది చిల్డ్రన్ అనే చైల్డ్ రైట్స్ బాడీ ప్రారంభించింది. ఎగ్జిబిషన్ ను ఏర్పాటు చేసిన వికీ రాయ్ ఒకప్పుడు చైల్డ్ లేబర్ కావడం గమనార్హం. ఉండటానికో ఇల్లు, పిలవడానికంటూ ఒక పేరు, సొంతంగా ఎలాంటి గుర్తింపనేది లేకుండా.. ఖాళీ కడుపుతో బతుకీడ్చుతారని వీధి పిల్లల బాధల గురించి వికీ చెప్పాడు. ఈ ఎగ్జిబిషన్ లో అలాంటి పిల్లలు వారి కుటుంబాల పరిస్థితులను ప్రదర్శించడంతోపాటు భవిష్యత్ పై వారు పెట్టకున్న నమ్మకాన్ని, కలలను చూయిస్తామని పేర్కొన్నాడు. ఈ ఎగ్జిబిషన్ ను https:support.savethechildren.in/streettoscreen/ ద్వారా యాక్సెస్ చేసుకోవచ్చన్నాడు.

Latest Updates