మరో రీమేక్ లో నటించనున్న వెంకటేష్

గోపాల గోపాల, దృశ్యం, ఘర్షణ లాంటి పవర్ ఫుల్ రీమేక్ మూవీస్ లో నటించి హిట్ కొట్టిన  విక్టరీ వెంకటేష్ తాజాగా మరో రీమేక్ మూవీలో నటించబోతున్నాడు.  తమిళ సినిమా అసురన్ రీమేక్ లో ‘వెంకీ మామ’ హీరోగా కనిపించనున్నాడు.  ధనుష్, మంజు వారియర్ జంటగా నటించిన ఈ యాక్షన్ డ్రామాను వెట్రిమారన్ తెరకెక్కించారు. దసరా సెలవుల్లో తమిళనాట విడుదలైన అసురన్ సంచలన విజయం సాధించింది. ఈ మధ్య కాలంలో కేవలం కథా ప్రాధాన్యం ఉన్న సినిమాలను మాత్రమే చేస్తున్న హీరో వెంకటేష్.. అసురన్ స్టోరీ గురించి తెలిసి ఆ చిత్ర తెలుగు రీమేక్‌లో నటించడానికి ఆసక్తి చూపుతున్నారని తెలిసింది.

ప్రస్తుతం వెంకీ మామ సినిమాతో బిజీగా ఉన్న ఈ దగ్గుబాటి హీరో… త్వరలో అసురన్ రీమేక్‌లో నటించడానికి సిద్ధమైనట్లు తెలిసింది. ‘అసురన్’ తెలుగు వర్షన్‌ను సురేష్ ప్రొడక్షన్స్, వి క్రియేషన్స్ సంస్థల్లో సురేష్ బాబు, కళైపులి ఎస్ థాను సంయుక్తంగా నిర్మించనున్నారు. అతి త్వరలో చిత్రయూనిట్ ఈ సినిమాకు సంబంధించిన నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను తెలియజేయనున్నారు.

Victory Venkatesh is going to star in the Tamil film Asuran remake