డుకాటిని లాంచ్ చేసిన మామా అల్లుళ్లు

విక్టరీ వెంకటేష్, నాగచైతన్య కలిసినటిస్తున్న సినిమా వెంకీమామ. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ స్పీడ్ గా జరుగుతుండగా ..ప్రమోసన్స్ పై కూడా అంతే ఫోకస్ పెట్టారు ఈ మామా అల్లుడు. సినిమా ప్రారంభం అయినప్పట్నేంచే వీరి కనిపిస్తే చాలు ఫ్యాన్స్ కు వెంకీ మామ గుర్తుకువస్తుంది. ఇటీవల నాగచైతన్య హీరోగా నటించిన మజిలీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు చీఫ్ గెస్ట్ గా వచ్చి అలరించాడు వెంకీ. ఈవెంట్ లో అంతా వెంకీమామా అంటూ సందడి చేశారు ఫ్యాన్స్. దీంతో మజిలీ ప్రీ రిలీజ్ వేడుకలో వెంకీమామకు ఫ్రీగా ప్రమోషన్ వచ్చింది. గురువారం మరోసారి తళుక్కున మెరిశారు మామా అల్లుడు. హైదరాబాద్ బంజారాహిల్స్ లో ఓ షోరూంను ప్రారంభించారు వెంకీ, చైతు.

లగ్జరీ మోటార్‌ సైకిల్‌ బ్రాండ్‌ డుకాటి ఇండియా 9వ షోరూమ్‌ ను ఏప్రిల్‌ 26న హైదరాబాద్‌, బంజారా హిల్స్‌ రోడ్‌ నెం. 12లో ప్రారంభించింది. ఈ ప్రారంభోత్సవానికి విక్టరీ వెంకటేష్‌, యువసామ్రాట్‌ అక్కినేని నాగచైతన్య ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. విక్టరీ వెంకటేష్‌ రిబ్బన్‌ కట్‌ చేసి డుకాటి ఇండియా షోరూమ్‌ను ప్రారంభించాడు. నాగచైతన్య నాలుగు నూతన స్క్రాంబ్లర్‌ మోడల్స్‌ ను ఆవిష్కరించాడు. వీరిద్దరినీ చూడటానికి ఫ్యాన్స్ ఎగబడ్డారు. బాబీ తెరకెక్కిస్తున్న వెంకీమామ దసరా కానుకగా ప్రేక్షకులముందుకు రానుంది. ఈ సినిమాలో వెంకీ సకసన పాయల్ రాజ్ పుత్ .. చైతూ జోడిగా రాశి ఖన్నా హీరోయిన్లుగా నటిస్తున్నారు.

 

Latest Updates