వైరల్ వీడియో: ప్రత్యర్థిని గెలిపించడానికి కావాలనే ఓడిపోయాడు

న్యూఢిల్లీ: పరుగు పందెంలో ముందుగా ఎవరైతే ఫినిషింగ్ లైన్‌‌ను దాటుతారో వారే గెలుస్తారనేది తెలిసిందే. ఇందుకోసం ప్రత్యర్థి అథ్లెట్లను క్రాస్ చేసుకుంటూ వేగంగా పరుగెత్తుతుంటారు. ఈ క్రమంలో కొందరు ప్లేయర్లు కావాలనే ఆధిక్యంలో ఉన్న వారిని కింద పడేసిన, నెట్టేసిన చెత్త ఘటనలనూ చూసే ఉంటాం. కానీ ఇక్కడో అథ్లెట్ తనతో పోటీగా పరిగెడుతున్న సహచర రన్నర్‌‌ను గెలిపించడం కోసం తాను ఓడిపోయి స్ఫూర్తిగా నిలిచాడు. నిజమైన క్రీడాస్ఫూర్తితో పరుగు పందెంలో నాలుగో స్థానంలో నిలిచినప్పటికీ ప్రేక్షకుల హృదయాల్లో ఫస్ట్ ప్లేస్‌‌లో నిలిచాడు.

ఆ కథాకమామీషు ఏంటో తెలుసుకుందాం.. స్పెయిన్‌‌లోని బార్సిలోనాలో ట్రైథ్లెట్ పోటీ జరుగుతోంది. అందరికంటే ముందంజంలో ఇద్దరు అథ్లెట్లు ఉండగా, వారి వెనకాల స్పానిష్ అథ్లెట్ డీగో మెంట్రిగా, బ్రిటిష్ అథ్లెట్ జేమ్స్ టీగల్‌‌ ఉన్నారు. ఈ సమయంలో ఓ టర్నింగ్ దగ్గర రాంగ్ టర్న్ తీసుకున్న జేమ్స్ టీగల్ ఫెన్సింగ్‌ను ఢీకొన్నాడు. దీంతో అతడు వెనుకబడ్డాడు. దీన్ని గమనించిన మెంట్రిగా మెళ్లిగా పరిగెత్తాడు. తాను మూడో ప్లేస్‌‌ దక్కించుకునే అవకాశం ఉన్నప్పటికీ టీగల్‌‌ కోసం త్యాగం చేశాడు. టీగల్ లైన్ క్రాన్ ఫినిషింగ్ లైన్ క్రాస్ చేసిన తర్వాతే మెంట్రిగా గీతను దాటాడు. దీంతో టీగల్ మూడో ప్లేస్‌‌లో నిలిచి బ్రాంజ్ మెడల్ దక్కించుకోగా.. మెంట్రిగా నాలుగో స్థానంతో సరిపెట్టుకున్నాడు. రేసు మొదలైనప్పటి నుంచి టీగర్ తన కంటే ముందున్నాడని దీనికి అతడు అర్హుడని మెంట్రిగా చెప్పడం విశేషం. సోషల్ మీడియాలో ఈ వీడియోను చూసిన నెటిజన్స్ మెంట్రిగాపై ప్రశంసల జల్లులు కురిపిస్తున్నారు. మరి ఈ స్పోర్టివ్ స్పోర్ట్స్‌‌మన్ వీడియోను మీరూ లుక్కేయండి.

Latest Updates