ఇంజనీరింగ్ విద్యార్థినిపై అత్యాచారం.. వీడియో తీసి బ్లాక్ మెయిల్

గుంటూరు : ఫ్రెండ్ షిప్ పేరుతో ఓ అమ్మాయిపై ఇద్దరు యువకులు అత్యాచారం చేశారు. దారుణాన్ని వీడియో తీసిన దుర్మార్గులు..ఈ విషయాన్ని బయటికి చెబితే సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తామని బెదిరించారు. ఈ దారుణ ఘటన ఏపీలోని గుంటూరు జిల్లాలో చోటుచేసుకుంది.

గుంటూరు జిల్లాలోని పేరేచర్లలో ఉన్న ఓ ఇంజనీరింగ్ కాలేజీలో అదే ప్రాంతానికి చెందిన యువతి చదువుతోంది. ఈ సందర్భంగా యువతితో పరిచయం పెంచుకున్న ఓ యువకుడు ఇటీవల ఆమెను బైక్ పై బయటకు తీసుకెళ్లాడు. ఈ సందర్భంగా తన స్నేహితుడికి ఫోన్ చేసి అక్కడకు పిలిపించిన యువకుడు, స్నేహితుడితో కలిసి యువతిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ తతంగాన్ని ఇద్దరూ వీడియో తీశారు. ఈ విషయాన్ని ఎక్కడైనా చెబితే వీడియోను ఫేస్ బుక్ లో పోస్ట్ చేస్తామని బెదిరించారు. ఈ ఘటన తర్వాత యువతిని పలుమార్లు బ్లాక్ మెయిల్ చేసి లైంగికదాడికి పాల్పడ్డారు. దీంతో యువతి అనారోగ్యానికి గురికాగా, అసలు విషయం తల్లిదండ్రులకు చెప్పింది. దీంతో యువతి తల్లిదండ్రులు గుంటూరు అర్బన్ లోని నల్లపాడు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నింధితుల కోసం గాలింపు చర్యలు చేపట్టామని తెలిపారు.

Latest Updates